English   

అద్భుతంగా మాట్లాడిన కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram Speech at Aravindha Sametha Pre-Release Event
2018-10-02 23:21:17

అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ వేడుక అన‌గానే అంతా ముందు ఊహించుకుంది నంద‌మూరి వార‌సులు ఇద్ద‌రూ ఏం మాట్లాడ‌తారు అనే..? అంద‌రిలోనూ ఇదే అనుమానం ఉంది. ఎన్టీఆర్ స్పీచ్ ఎలాగూ అదిరిపోయింది. ఇక ఆయ‌న కంటే అందంగా హూందాగా మాట్లాడాడు క‌ళ్యాణ్ రామ్. ఈయ‌న స్పీచ్ చాలా చ‌క్క‌గా సాగింది. సినిమా ఖచ్చితంగా అద‌ర‌గొడుతుంద‌ని చెప్పిన క‌ళ్యాణ్.. ఆ త‌ర్వాత తండ్రి గురించి మాట్లాడాడు. నెల రోజుల కింద త‌మ ఇంట్లో ఓ విషాదం జ‌రిగింద‌ని.. అది అంద‌రికీ తెలుస‌ని.. దాంతో ఖచ్చితంగా అర‌వింద సమేత వాయిదా ప‌డుతుందేమో అని చాలా మంది డౌట్ ప‌డ్డార‌ని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. 1962.. ఎన్టీఆర్ మొహానికి రంగేసుకుని షూటింగ్ కు వెళ్లాడు.. మ‌ధ్యాహ్నం షాట్ లో ఉన్న‌పుడు నంద‌మూరి తార‌క‌రామారావు పెద్ద కొడుకు రామ‌కృష్ణ చ‌నిపోయార‌ని కాల్ వ‌చ్చింద‌ని.. కానీ కాల్షీట్ పూర్తి చేసిన త‌ర్వాత ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాడ‌ని.. అది నిర్మాతల‌కు ఆయ‌న ఇచ్చే విలువ అని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్.

ఆ త‌ర్వాత 1976లో త‌మ తాత ల‌క్ష్మ‌య్య చౌద‌రి గారు పొలం నుంచి తిరిగి వ‌స్తూ శంషాబాద్ ద‌గ్గ‌ర యాక్సిడెంట్ లో క‌న్నుమూసారు. అప్పుడు కూడా షూటింగ్ పూర్తి చేసుకున్న త‌ర్వాతే తండ్రి శవాన్ని చూడ్డానికి వెళ్లాడు ఎన్టీఆర్. 1982లో బాల‌య్య‌, రామ‌కృష్ణ బాబాయ్ ల పెళ్లిళ్లు జ‌రుగుతున్న‌పుడు కూడా ప్ర‌జా జీవితంలో ఉండి సొంత కొడుకుల పెళ్లికి కూడా రాలేదు మా తాత ఎన్టీఆర్. అది ఆయ‌న వృత్తికి ఇచ్చే గౌర‌వం అని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. ఇక ఆగ‌స్ట్ 29, 2018 రోజు కూడా జ‌ర‌గ‌రాని ఘోరం జ‌రిగిపోయింది. అది జ‌రిగిన ఐదో రోజు త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ షూటింగ్ కు వెళ్లాడ‌ని.. అది నిర్మాత‌ల‌కు తాము ఇచ్చే గౌర‌వం విలువ అని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. చివ‌ర్లో తండ్రి కోసం పాట కూడా పాడాడు క‌ళ్యాణ్ రామ్. ఏడ బోయినాడో అంటూ పాడిన పాట‌తో ఎన్టీఆర్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత తండ్రి కోసం రెండు నిమిషాలు అంద‌రితో మౌనం పాటించమ‌ని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్.
 

More Related Stories