English   

పూజాహెగ్డే డుమ్మా కొట్టింది

reason behind pooja hegde missed aravinda sametha pre release event
2018-10-03 07:19:49

సినిమా వేడుక జ‌రిగితే ఖచ్చితంగా అందులో న‌టించిన హీరో హీరోయిన్లు రావ‌డం క‌నీస ధ‌ర్మం. అయితే ఇప్పుడు అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ వేడుక‌కి పూజాహెగ్డే రాలేదు. ఈమె రాక‌పోవ‌డానికి చాలా కార‌ణాలున్నాయి. ఇప్పుడు ఈమె ఫుల్ బిజీగా ఉంది. ఒక్కొక్క‌రికీ కెరీర్ లో ఒక్కో టైమ్ న‌డుస్తుంటుంది. అది ఇప్పుడు పూజాకు న‌డుస్తుంది. క‌నీసం కంటి నిండి కునుకు తీయ‌డానికి కూడా టైమ్ దొర‌క‌డం లేదు. ఈ టైమ్ నే త‌న కెరీర్ కోసం వాడుకుంటుంది పూజా. ప్ర‌స్తుతం జై స‌ల్మీర్ లో హౌజ్ ఫుల్ 4 షూటింగ్ తో బిజీగా ఉంది ఈ భామ‌. మొన్నీమ‌ధ్యే స్పెష‌ల్ ఫ్లైట్ వేసుకుని ప్ర‌భాస్ సినిమా ఓపెనింగ్ కు వ‌చ్చెళ్లింది పూజా. అంత బిజీగా ఉంది ఈ భామ‌.

ఇప్పుడు హౌజ్ ఫుల్ 4 అయిన త‌ర్వాత ప్ర‌భాస్-రాధాకృష్ణ సినిమా కోసం ఇట‌లీ వెళ్ల‌నుంది. అక్క‌డ కొన్ని రోజులు ఉండి.. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమా కోసం యుఎస్ రానుంది. అక్టోబ‌ర్ 15 నుంచి ఈ చిత్ర షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇలా ఒక దేశం నుంచి మ‌రో దేశం.. ఓ హీరో నుంచి మ‌రో హీరోతో బిజీగా మారిపోయింది పూజాహెగ్డే. ఇంత బిజీగా ఉంది కాబ‌ట్టే అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ కు రాలేదు ఈ భామ‌. అయితే విడుద‌లైన ట్రైల‌ర్ లో పూజాహెగ్డే వాయిస్ మాత్రం అదిరిపోయింది. తెలుగుమ్మాయి మాదిరే ఇందులో మాట్లాడింది. ఆమె వాయిస్ తోనే ట్రైల‌ర్ మొద‌లు పెట్టాడు త్రివిక్ర‌మ్.

More Related Stories