English   

త్రివిక్రమ్ మౌనానికి కారణం..?

Trivikram Maintains Silence in aravinda sametha event
2018-10-03 08:42:22

త్రివిక్ర‌మ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ముందుగా అంద‌రూ వేచి చూసేది ఆయ‌న మాట‌ల కోస‌మే. కానీ అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ లో మాత్రం ఏం మాట్లాడ‌లేదు.. అంతా సినిమాలోనే చూపించాల‌ని ఫిక్సైపోయాడు మాట‌ల మాంత్రికుడు. క‌థ పాత‌దే అయినా కూడా కొత్త‌గా చెప్పాల‌ని ఫిక్క‌స్ అయిపోయాడు మాట‌ల మాంత్రికుడు. ప్ర‌తీసారి ఆడియో వేడుక‌ల్లో హీరోల గురించి.. సినిమా గురించి గొప్ప‌గా చెప్పే ఈయ‌న ఈ సారి మాత్రం చాలా సైలెంట్ అయిపోయాడు. అజ్ఞాత‌వాసి ఎఫెక్ట్ బాగా ప‌ని చేసిన‌ట్లుంది అందుకే సింపుల్ గా మాట‌ల్లేకుండా సినిమాల్లో చూద్దాం అంటున్నాడు. అస‌లు ఒక్క‌మాట కూడా మాట్లాడ‌కుండా త్రివిక్ర‌మ్ ఇంత సైలెంట్ గా ఉన్నాడంటే అస‌లు సినిమాలో ఎంత మ్యాట‌ర్ ఉందో అని అభిమానులు కూడా ఆస‌క్తిగా చూస్తున్నారు. ఒక్క ఫ్లాప్ ప‌డ‌గానే ఈయ‌న మాట‌ల్లో కూడా మార్పు వ‌చ్చింది. క‌సితో ఈ సినిమాను తెర‌కెక్కించాడ‌నే సంగ‌తి చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. అక్టోబ‌ర్ 11న సినిమా విడుద‌లైన త‌ర్వాత అందులోనే అన్ని ముచ్చ‌ట్లు మాట్లాడుకుందాం అంటున్నాడు త్రివిక్ర‌మ్. మ‌రి ఈయ‌న కాన్ఫిడెన్స్ రేంజ్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి..!

More Related Stories