English   

ప్రియున్ని కొంగున క‌ట్టేసుకున్న ప్రియాంక‌..

Priyanka-Chopra
2018-10-03 11:06:59

ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా ముందు అమ్మాయే క‌దా..? అందుకే ప్రియాంక చోప్రా కూడా ప‌తియే ప్ర‌త్య‌క్ష దైవం అంటుంది. అన్న‌ట్లు ఈమె క‌ట్టుకునేది ప‌రాయి దేశ‌పు వ‌రుడే అయినా కూడా పెళ్లి మాత్రం ప‌క్కాగా ఇండియ‌న్ స్టైల్ లో జ‌రుగుతుంది. ఇదివ‌రకు నిశ్చితార్థం కూడా మ‌న స్టైల్ లోనే సాగింది. ఇప్పుడు పెళ్లి విష‌యంలోనూ ప్రియాంక మాటే నెగ్గుతుంది. వీళ్ల పెళ్లి రాజ‌స్థాన్ లో జ‌ర‌గ‌బోతుంది. అంతా డెస్టినేష‌న్ వెడ్డింగ్ అంటూ ప‌రుగులు తీస్తుంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా మాత్రం ఇండియ‌న్ స్టైల్ లో పెళ్లి అంటుంది. అందుకే జోధ్ పూర్ లో మండే ఎండ‌ల్లో ప్రియుడు నిక్ తో క‌లిసి కాళ్లు కాలేలా తిరిగింది. త‌మ పెళ్లి వేడుక జ‌రుపుకునే వేదిక కోసం చూసారు. అస‌లు ఈ మ‌ధ్య ప్రియున్ని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండ‌లేక‌పోతుంది ప్రియాంక చోప్రా. 

ఇదే భార‌తీయ మ‌హిళ‌ల సూత్రం. ఎంత‌పెద్ద స్థానంలో ఉన్నా.. ఎవ‌రెంత తోపు అయినా కూడా ఒక్క‌సారి పెళ్లైన త‌ర్వాత ఆ సెంటిమెంట్ మ‌రోలా ఉంటుంది. ఎందుకో తెలియ‌దు కానీ ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్  అయిపోతుంటారు అమ్మాయిలు. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ఈమె కూడా త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. కోరుకున్న ప్రియుడు నిక్ జోన్స్ తోనే ఏడ‌డుగులు వేస్తుంది ఈ భామ‌. ఎంగేజ్ మెంట్ ముందు వ‌రకు కూడా ఎలా ప‌డితే అలా ఉన్నా కూడా నిశ్చితార్థం నుంచి మాత్రం ప‌క్కా ఇండియ‌న్ అమ్మాయిగా మారింది ప్రియాంక‌. అప్ప‌ట్నుంచీ అన్నీ భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కార‌మే జ‌రుపుకుంటుంది. నిశ్చితార్థం కూడా చాలా ప‌ద్ద‌తిగా చేసుకుంది ప్రియాంక‌. ఇక ఇప్పుడు కాబోయే భ‌ర్త కాళ్ల ద‌గ్గ‌ర కూర్చుంది.

భ‌ర్తపై గౌర‌వం పెరిగిపోయింది ఈ భామ‌కు. అందుకే నిక్ కాళ్ల ద‌గ్గ‌ర కూర్చుని ఈ మ‌ధ్య ఓ ఫోటోషూట్ చేసింది. అయితే అస‌లు వీళ్లిద్ద‌రి ప‌రిచ‌యం మొద‌లైన తీరు మాత్రం న‌వ్వు తెప్పించ‌క మాన‌దు. నిక్ తో ప్రియాంక‌కు ప‌రిచ‌యం చాలా వింత‌గా జ‌రిగింది. 2017 గాలా రెడ్ కార్పెట్ ద‌గ్గ‌రే ఈ ఇద్ద‌రూ తొలిసారి క‌లిసారు.. అక్క‌డే జంటగా మెరిశారు. ఆ సందర్భంగా ఒకరోజు డేట్ కు వెళ్లారు. అస‌లు అప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని వ్య‌క్తితో.. అందులోనూ త‌న‌కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడైన నిక్ జోన‌స్ తో డేటింగ్ కు ఎందుకు వెళ్లిందో తెలుసా.. ఇద్ద‌రూ ఒకే క‌ల‌ర్ డ్ర‌స్ వేసుకున్నార‌ని. ఇది విన్న త‌ర్వాత అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ త‌ర్వాత ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకున్నారు.. ఇప్పుడు వీళ్ల పెళ్లి వ‌ర‌ల్డ్ వైడ్ గా ట్రెండింగ్ అవుతుంది. 

More Related Stories