English   

అస‌లు ఎన్టీఆర్ తో నాకు పోటీ ఏంటి..? 

NTR-Vijay-Devarakonda
2018-10-03 12:02:45

మా హీరో నైజాం మార్కెట్ అంత ఉండ‌దురా.. మీ వాడి లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్లు.. అని నేనింతేలో పూరీ జ‌గ‌న్నాథ్ అభిమానుల‌ను ఉద్దేశించి ఓ డైలాగ్ రాసాడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న‌ను త‌ను ఈ డైలాగ్ తోనే పోల్చుకున్నాడు. ఎన్టీఆర్ అర‌వింద స‌మేతతో నోటా సినిమా పోటీ ప‌డుతుంది క‌దా ఎలా అనిపిస్తుంది అంటే.. ఎన్టీఆర్ ఎక్క‌డ‌.. తానెక్క‌డ‌.. మా రెండు సినిమాల‌కు పోలికేంటి..? ఆయ‌న సినిమా కంటే త‌న సినిమా అంచ‌నాలు ప‌దిరెట్లు త‌క్కువ‌గా ఉంటాయి.. అస‌లు పోటీ అనే మాటే లేదిక్క‌డ అంటూ స‌మాధానం ఇచ్చాడు విజ‌య్. అంతేకాదు.. ఒక‌వేళ ఈ పోటీలో భ‌య‌ప‌డాల్సి వ‌చ్చినా.. వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చినా ముందు రావాల్సింది నేనే అంటూ చెప్పాడు విజ‌య్. 

అంటే అరవింద స‌మేత‌కు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతా ఇచ్చి ఎన్టీఆర్ అబిమానుల మ‌న‌సు కూడా గెలుచుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత కూడా అర‌వింద స‌మేత‌తో త‌న‌కు ప్ర‌మాదం ఉంద‌ని ఒప్పుకున్నాడు విజ‌య్. ఎన్టీఆర్ సినిమా కంటే వారం రోజుల ముందే త‌న సినిమా తీసుకురావడం సాహ‌సం అని తెలిసినా కూడా చేస్తున్నాన‌ని చెప్పాడు ఈ హీరో. అస‌లు ముందు ద‌స‌రా హాలీడేస్ లో త‌న సినిమా విడుద‌ల చేయాల‌నుకున్నా కూడా అనుకోని కార‌ణాల‌తో నోటా అక్టోబ‌ర్ 5కి వ‌చ్చింద‌ని చెప్పాడు ఈ హీరో. ఎవ‌రు ఏం అనుకున్నా కూడా ఎన్టీఆర్ సినిమాతో త‌న సినిమా పోటీ అనేది అస‌లు స‌రిపోని ప‌దం అని.. ఆయ‌న ఇమేజ్ ముందు తాను చిన్న రేణువు అంటున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌రి చూడాలిక‌.. ఈ రేణువు ఆ ఇసుక తుఫాన్ ను ఎలా అడ్డుకుంటుందో..? 

More Related Stories