English   

తెలంగాణ ఎన్నిక‌ల‌పై నోటా ప్ర‌భావం చూపిస్తుందా..? 

NOTA
2018-10-03 14:28:01

ఓ సినిమా చూసి ప్రేక్ష‌కులు మారిపోతారా..? అందులో హీరో చేసిన‌ట్లు ఇక్క‌డ చేస్తున్నారా..? అంత సీన్ అయితే ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అలా అయితే హీరోలు మంచి ప‌నులు ఎన్నో చేస్తుంటారు క‌దా.. మ‌రి అదంతా ఎందుకు ఫాలో అవ్వ‌రు..? ఓన్లీ ముద్దులు, హ‌గ్గులు, గుద్దులు మాత్ర‌మే చూసి ఇన్ స్పైర్ అవుతారా..? ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే నోటా సినిమా విడుద‌ల‌ను ఆపాలంటూ కొన్ని రాజ‌కీయ‌ పార్టీలు ర‌చ్చ చేస్తుండ‌టం చాలా కామెడీగా అనిపిస్తుందంటున్నారు విమ‌ర్శ‌కులు. లేక‌పోతే మ‌రేంటి..? ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌ల‌పై ఈ సినిమా ప్ర‌భావం చూపిస్తుంద‌నేది వాళ్ల వాద‌న‌. నిజంగానే సినిమాలో అంత విష‌యం ఉంటుందా..? 

ఓ సినిమాకు ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావింత చేసేంత స‌త్తా ఉంటుందా..? ఏమో ఉంటుందేమో అంటున్నారు కొంద‌రు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది కూడా. అందుకే నోటా విడుద‌ల ఆపాలంటున్నారు. మ‌రోవైపు విజ‌య్ కూడా ప్ర‌తీ ఒక్క‌రు ఓటేయండి.. ఓటు హ‌క్కు మీ బాధ్య‌త అంటూ అభిమానుల‌తో ప్ర‌తిజ్ఞ‌లు చేయిస్తున్నాడు. అంతేకాకుండా త‌ను పార్టీకి ప్ర‌చారం చేయ‌క పోయినా కూడా వ్య‌క్తికి చేస్తానంటూ చెప్పాడు. అంటే కేటీఆర్ కు అన్న‌మాట‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో నోటా వ‌స్తే క‌చ్చితంగా ఎన్నిక‌ల్లో ఆ చిత్ర ప్ర‌భావం ఉంటుంద‌నేది మ‌రో పార్టీ ఆలోచిస్తుంది. అందుకే సినిమాలోని కొన్ని సీన్స్ తీసేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.. లేక‌పోతే సినిమా విడుద‌ల కానిచ్చేది లేద‌ని తేల్చి చెబుతున్నారు. మ‌రి నిజంగానే నోటాకు అంత సీన్ ఉందో లేదో అక్టోబ‌ర్ 5న తేల‌నుంది. 

More Related Stories