English   

బిజినెస్ లో అర‌వింద స‌మేత స‌రికొత్త రికార్డులు.. 

Aravinda-Sametha
2018-10-03 16:34:32

మూడేళ్లుగా ఎన్టీఆర్ కెరీర్ టాప్ స్పీడ్ లో ఉంది. మెల్ల‌గా ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఒకప్పుడు 50 కోట్ల మార్కెట్ కూడా లేని స్టార్ హీరోగా ఎన్టీఆర్ ఉండేవాడు.. కానీ నాన్న‌కు ప్రేమ‌తో నుంచి వ‌ర‌స‌గా 50 కోట్ల క్ల‌బ్ లో అడుగు పెడుతూనే ఉన్నాడు. టెంప‌ర్ నుంచి ఈయ‌న కెరీర్ ట‌ర్న్ తీసుకుంది. నాన్న‌కు ప్రేమ‌తో.. జ‌న‌తా గ్యారేజ్.. జై ల‌వ‌కుశ సినిమాలు ఎన్టీఆర్ ఇమేజ్ మ‌రింత పెంచేసాయి. ఇక ఇప్పుడు అర‌వింత స‌మేత‌తో మ‌రింత హైట్స్ కు చేరుకోవాల‌ని చూస్తున్నాడు ఎన్టీఆర్. అజ్ఞాత‌వాసి ఫ్లాప్ అయినా కూడా ఒక్క ప్లాప్ తో త్రివిక్ర‌మ్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌డం తెలివి త‌క్కువే. ఈ సినిమాకు క్రేజ్ ఎంతుంద‌నేది ఇప్పుడు అమ్ముడ‌వుతున్న రేట్స్.. రైట్స్ ను చూస్తుంటే అర్థ‌మైపోతుంది. 

ఇప్ప‌టికే శాటిలైట్ జీ చానెల్ అన్ని భాష‌ల‌కు క‌లిపి 24 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఇప్పుడు సీడెడ్ హ‌క్కుల‌ను ఏకంగా 15 కోట్ల‌కు పైగా చెల్లింది సొంతం చేసుకున్నారు. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కంటే ముందు కేవ‌లం ముగ్గురు హీరోలే ఉన్నారు. సీడెడ్ బాహుబ‌లి 2 హ‌క్కులు 25 కోట్ల‌కి అమ్ముడ‌య్యాయి.. ఆ త‌ర్వాత ప‌వ‌న్ కళ్యాణ్ అజ్ఞాత‌వాసికి 16.20 కోట్ల‌కు వెళ్లాయి. రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమా కూడా 15.60 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. వీటి త‌ర్వాత ఇప్పుడు అరవింత స‌మేత 15.20 కోట్ల‌కు అమ్ముడై రికార్డ్ సృష్టించాయి. 

ఇక నైజాం దిల్ రాజు కూడా భారీ మొత్తం చెల్లించి ఈ చిత్ర హ‌క్కుల‌ను తీసుక‌న్న‌ట్లు తెలుస్తుంది. ఓవ‌ర్సీస్ లో 12 కోట్ల‌కు సినిమాను అమ్మేసారు. మిగిలిన ఏరియాల్లో కూడా అర‌వింద స‌మేత రికార్డు రేట్ల‌కు అమ్ముడైపోయింది. అజ్ఞాత‌వాసి ప్లాప్ అయినా కూడా దాని ప్ర‌భావం అయితే ఈ సినిమాపై క‌నిపించ‌డం లేదు. సినిమా అంతా బిజినెస్ క‌లుపుకుంటే ఇప్ప‌టికే 90 కోట్ల‌కు పైగానే జ‌రుగుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. చాలా ఏళ్ల త‌ర్వాత సీమ నాదే అంటూ వ‌స్తున్నాడు ఎన్టీఆర్. మ‌రి ఈయ‌న ఆశ‌ల‌ను అర‌వింద స‌మేత ఎంత‌వ‌ర‌కు తీరుస్తుందో చూడాలిక‌..!

More Related Stories