English   

అంత‌రిక్షంలోంచి బ‌య‌ట‌ప‌డిన వ‌రుణ్ తేజ్.. 

Varun-Tej
2018-10-03 17:33:05

వ‌రుణ్ తేజ్ ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు ఈ హీరో. అయితే ఇందులో ఎఫ్ 2తో పాటు అంత‌రిక్షం సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు. అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 2 ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇదే స‌మ‌యంలో సంక‌ల్ప్ రెడ్డితో చేస్తున్న అంత‌రిక్షం షూటింగ్ ఇప్పుడు పూర్తి చేసుకుంది. జులైలోనే దీనికి సంబంధించిన వ‌ర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన భాగం కూడా పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది. గుమ్మ‌డికాయ్ కొట్టేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. డిసెంబ‌ర్ 21న అంత‌రిక్షం విడుద‌ల కానుంది. 

లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద‌రీ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క్రిష్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాడు. క‌చ్చితంగా ఈ చిత్రంతో వ‌రుణ్ తేజ్ మ‌రో హిట్ కొడతాన‌నే ధీమాతో ఉన్నాడు. విడుద‌ల‌కు ఇంకా రెండు నెల‌లు ఉన్నా కూడా ఇప్పుడే షూటింగ్ పూర్తి చేసాడు సంక‌ల్ప్. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కు ఎక్కువ‌గా టైమ్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం చాలా స‌మ‌యం కేటాయిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి ఈ చిత్రంతో వ‌రుణ్ తేజ్ హ్యాట్రిక్ అందుకుంటాడా లేదా అనేది చూడాలిక‌. తొలిప్రేమ‌.. ఫిదా సినిమాల‌తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు మెగా వార‌సుడు. 

More Related Stories