English   

యంగెస్ట్ సిఎంగా విజ‌య్ దేవ‌ర‌కొండ రికార్డ్..

Vijay-devarakonda
2018-10-03 17:53:55

30 ఏళ్లు కూడా నిండ‌కుండానే ముఖ్య‌మంత్రి పీఠం మీద కూర్చోవ‌డం అంటే మాట‌లు కాదు. అది ఎంత ముళ్ల‌కంచె అని తెలిసినా కూడా ఇలాంటి బాధ్య‌త తీసుకోవ‌డం నిజంగా అద్భుత‌మే. మ‌హేశ్ బాబు లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్ ఈ రోల్ చేసినా కూడా బాగుంటుంది కానీ క‌నీసం 30 ఏళ్ళు లేని అర్జున్ రెడ్డి లాంటి ఆవేశ‌ప‌రుడి చేతికి సిఎం ప‌గ్గాలు రావ‌డం అంటే అబ్బో త‌లుచుకోడానికి కూడా భ‌యంగా ఉంది క‌దా. కానీ ఈ భాధ్య‌త‌నే ఇప్పుడు తీసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నోటా సినిమా కోసం ఈయ‌న ముఖ్య‌మంత్రి అయ్యాడు. తాను చేయాల‌నుకున్న‌వ‌న్నీ చేస్తున్నాడు. అంతేకాదు.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనే తాను సిఎం అని.. త్వ‌ర‌లోనే సౌత్ ఇండియా మొత్తానికి సిఎం అవుతానంటున్నాడు.
 
అంటే తెలుగు ఇండ‌స్ట్రీ ఒక్క‌టే కాదు.. త‌న టార్గెట్ అన్ని ఇండ‌స్ట్రీలు అని చెప్ప‌క‌నే చెబుతున్నాడు విజ‌య్. ఇప్ప‌టికే మ‌నోడికి త‌మిళ‌నాట కూడా ఫుల్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది. ఇప్పుడు కానీ నోటా త‌మిళ్ లో ఆడిందంటే ర‌చ్చ రంబోలే. ఇక విజ‌య్ ను ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. అర్జున్ రెడ్డి.. గీత‌గోవిందం లాంటి సినిమాలు తెలుగు వ‌ర్ష‌న్ లోనే త‌మిళ‌నాట దుమ్ము లేపాయి. ఇలాంటి టైమ్ లో విజ‌య్ సినిమా వ‌స్తుందంటే క్రేజీగా చూస్తున్నారు ప్రేక్ష‌కులు. అందుకే అన్ని రాష్ట్రాల‌ను ముఖ్య‌మంత్రిని అవుతాన‌ని ధీమాగా చెబుతున్నాడు విజ‌య్. మ‌రి ఈయ‌న ఆశ తీరుతుందో లేదో చూడాలిక‌..!

More Related Stories