English   

వేర్ ఈజ్ అనుష్క.. కాంటెస్ట్ రన్ చేయాలేమో..?

Anushka
2018-10-03 11:52:34

ఒక్కోసారి కెరీర్ లో తీసుకునే నిర్ణ‌యాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి పూర్తిగా కెరీర్ నే మార్చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు అనుష్క‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. క్రేజ్ చూస్తే ఆకాశ‌మంత ఉంది.. కానీ అవ‌కాశాలు మాత్రం రావ‌ట్లేదు. ఒక్క మాట‌లో చెప్పా లంటే ఇప్పుడు అనుష్క స్టార్ హీరోయిన్ కాదేమో అనిపిస్తుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ నెక్ట్స్ ఏంటి అనే ఆలోచ‌నే అనుష్క‌కు రాలేదు. కానీ ఇప్పుడు ఫ‌స్ట్ టైమ్ వ‌చ్చింది. చేతిలో ఉన్న సినిమాల‌న్నీ అయిపోయి.. ప్ర‌స్తుతానికి ఖాళీగా ఉంది ఈ భామ‌. ద‌ర్శ‌కులే ఈమెను కాదంటున్నారా.. లేదంటే కాదను కుంటుందా అనే అనుమానం వ‌స్తుంది. పైగా అనుష్క కెరీర్ మొద‌లుపెట్టి ప‌దేళ్లు దాటేసింది. ఏ రోజు స‌న్న‌గా క‌నిపించ‌లేదు. అలా అని లావుగా ఎబ్బెట్టుగా కూడా మారిపోలేదు. యోగా బ్యూటీగా ఎలా ఉండాలో త‌న‌కు తెలుసు కాబ‌ట్టి అలాగే మెయింటేన్ చేసింది. కానీ ఒక్క సినిమా అనుష్క కొంప ముంచేసింది.

అదే సైజ్ జీరో. ఈ సినిమా కోసం 100 కేజీలకు మారిపోయింది అనుష్క‌. గ్రాఫిక్స్ లో క‌వ‌ర్ చేసుకుందామంటే వ‌ద్దు న్యాచుర‌ల్ గా బ‌రువు పెరుగుతానంటూ ఒకేసారి అన్ని కేజీలు పెరిగింది అనుష్క‌. ఆ సినిమా వ‌చ్చి ఏడాది దాటినా.. ఇప్ప‌టికీ అనుష్క నార్మ‌ల్ అవతారంలోకి మార‌లేదు. ఆంటీలా మారిపోయింది. ఈ రూపంతోనే బాహుబ‌లి 2, ఓం న‌మో వెంక‌టేశాయా, సింగం 3 షూటింగ్ పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ ఏడాది భాగ‌మ‌తి త‌ర్వాత అనుష్క అస‌లు సినిమాలు చేయ‌డ‌మే మానేసింది. బ‌య‌ట క‌నిపించ‌డం కూడా త‌గ్గించేసింది. అస‌లు ఈమె సినిమాలు చేస్తుందా చేయ‌దా అనే విష‌యంలో కూడా అనుమానాలు వ‌స్తున్నాయి.    
           
ఈమెపై ఇంత ప్ర‌చారం జ‌రుగుతున్నా అనుష్క మాత్రం చాలా కూల్ గా ఉంది. ఇండ‌స్ట్రీ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు.. అవన్నీ వూహలే అనను. అలాగని అన్నీ నిజాలు కూడా కావు. ఏ రంగంలో అయినా మంచీ చెడూ రెండూ ఉంటాయి. పాలు, నీళ్లు కలిపితే హంస పాలని మాత్రమే స్వీకరించగలదట. అలా మనం కూడా మారాలి. ఏది గ్రహించాలో, ఏది వదులుకోవాలో అనే విజ్ఞత మనకున్నప్పుడు చెడు గురించి భయపడడంలో అర్థం లేదు. ఓ సినిమా ఫ్లాప్‌ అయితే అంతా పోయినట్టు కాదు.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ వ‌స్తానంటూ స్టేట్మెంట్స్ ఇస్తుంది. అయితే ఈ మ‌ధ్య ఎన్ని సినిమాల పేర్లు వినిపించినా కూడా ఒక్క‌టి కూడా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు అనుష్క‌. అందుకే అస‌లు ఈమె మ‌ళ్లీ న‌టిస్తుందా అనే కొత్త డౌట్లు కూడా వ‌స్తున్నాయిప్పుడు.

More Related Stories