English   

భూమిక గ్లామ‌ర్ డోస్ పెంచేసిందేంటి..?

Bhookima Chawla Latest Hottest Photoshoot
2018-10-04 07:49:30

భూమిక‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఒక‌ప్పుడు ప‌వ‌న్ హీరోయిన్ గా తెలుగులో భూమిక‌కు చాలా క్రేజ్ ఉండేది. ఖుషీ సినిమాతో ఈమె సృష్టించిన సంచ‌ల‌నం అలాంటిది మ‌రి. ఆ త‌ర్వాత చాలా మంది స్టార్ హీరోల‌తో న‌టించింది భూమిక. చిరు నుంచి అల్ల‌రి న‌రేష్ వ‌ర‌కు అంద‌రితోనూ న‌టించింది. యోగా గురువు భ‌ర‌త్ ఠాకూర్ ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది భూమిక‌. ఆర్థికంగా కూడా భూమిక ప‌రిస్థితి పెద్ద‌గా చెప్పుకోడానికి ఏమీ లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో ఈ మ‌ధ్యే మ‌ళ్లీ సినిమాల వైపు వ‌చ్చింది ఈ భామ‌.

ధోనీ సినిమాలో ఎమ్మెస్ ధోనీకి అక్క పాత్ర‌లో న‌టించిన భూమిక‌.. ఎంసిఏలో నానికి వ‌దిన‌గా న‌టించింది. ఈ సినిమాలో భూమిక పాత్ర ప్రాణం. దాంతో ఇప్పుడు ఈమెకు తెలుగులో ఆఫ‌ర్లు పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచిలోనూ భూమిక ప్ర‌ధాన భూమిక పోషిస్తుంది. ఇందులోనూ చైతూకు వ‌దిన పాత్ర‌లోనే భూమిక న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు చందూమొండేటి ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే భూమిక ఇప్పుడు స‌డ‌న్ గా గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. ఎందుకో తెలియ‌దు కానీ ఇప్పుడు డోస్ పెంచి గ్లామ‌ర్ కారెక్ట‌ర్స్ కు కూడా సై అనేస్తుంది. మ‌రి ఈ ఏజ్ లో భూమికకు గ్లామ‌ర్ రోల్స్ ఇచ్చే ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో..?

More Related Stories