English   

నంద‌మూరి బుడ్డోడు దుమ్ము దులిపేసేలా ఉన్నాడు

NTR’s Son Abhay Ram Making Fun in Aravindha Sametha Making Video
2018-10-04 09:50:16

మీ తాత క‌త్తి ఎత్తితే అది అవ‌స‌రం.. మీ నాయ‌న క‌త్తి ప‌డితే అది వార‌స‌త్వం.. అదే క‌త్తి నువ్వు దూస్తే అది ల‌క్ష‌ణం.. అది నీ బిడ్డ నాటికి లోపం అవుతుందేమో చూడు అంటూ అద్భుత‌మైన డైలాగ్ రాసాడు త్రివిక్ర‌మ్. అన్న‌ట్లుగానే ఇప్పుడు ఎన్టీఆర్ బిడ్డ కూడా క‌త్తి ప‌ట్టేసాడు. అయితే సినిమాలో మాత్రం కాదు.. ఇప్పుడు అర‌వింద స‌మేత మేకింగ్ వీడియో ఒక‌టి విడుద‌ల చేసారు. అందులో షూటింగ్ ఎంత స‌ర‌దాగా సాగిందో చూపించారు. ఓ రోజు సెట్ కు వ‌చ్చాడు నంద‌మూరి బుడ్డోడు అభ‌య్ రామ్.

NTR’s Son Abhay Ram Making Fun in Aravindha Sametha Making Video

త్రివిక్ర‌మ్ ఒళ్లో కూర్చుని క‌త్తి అంటే ఏంటో తెలియ‌ని వ‌య‌సులోనే దాంతో ఆడుకుంటున్నాడు. అక్క‌డ నాన్న స్క్రీన్ పై చెల‌రేగిపోతుంటే.. ఇక్క‌డ స్క్రీన్ వెన‌క కొడుకు కూడా క‌త్తుల‌తో ఆడేసుకుంటున్నాడు. అభ‌య్ రామ్ ను చూసి చిలిపిగా మురిసిపోతున్నాడు ఎన్టీఆర్. ఈ బుడ్డోడు ఇప్పుడే ఇలా ఉంటే రేప‌టి రోజు ఖచ్చితంగా హీరోగా మారి దుమ్ము దులిపేసేలా క‌నిపిస్తున్నాడు. అయినా ఎన్టీఆర్ కూడా అంతేక‌దా.. చిన్న‌ప్పుడే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స‌త్తా చూపించాడు. అదే ర‌క్తం క‌దా.. ఎక్క‌డికి పోతుంది ఆ ల‌క్ష‌ణం..!

More Related Stories