English   

అఖిల్ ప్రియా జోడి బాగుంది

Akhil Akkineni
2018-10-04 10:51:19

అఖిల్.. ప్రియా వారియ‌ర్.. అబ్బా భ‌లే ఉంది క‌దా కాంబినేష‌న్. ఇప్ప‌టికే నేష‌న‌ల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ప్రియా వారియ‌ర్. ఇక అఖిల్ ఇప్ప‌డిప్పుడే స్టార్ హీరోగా అడుగులు వేసే క్ర‌మంలో ఉన్నాడు. మెల్ల‌మెల్ల‌గా త‌న ఇమేజ్ పెంచుకుంటున్నాడు. హ‌లో సినిమాతో ప్రేమికుడిగా ప్రేక్ష‌కులకు బాగానే చేరువ‌య్యాడ. ఇప్పుడు మిస్ట‌ర్ మ‌జ్ను అంటూ అఖిల్ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా ల‌వ‌ర్ బాయ్ గా ఎప్పుడూ అక్కినేని హీరోకు బ్రాండ్ ఇమేజ్ ఉండ‌నే ఉంది. మ‌నోడు హీరోగా కంటే కూడా యాడ్స్ లో ఇంకా ఫేమ‌స్. హీరో కాక‌ముందే బాలీవుడ్ లోనూ ఎండోర్స్ చేసొచ్చాడు. పైగా మౌంటెన్ డ్యూ.. టైటాన్ లాంటి బ్రాండ్స్ కు నేష‌న‌ల్ వైజ్ ఎండోర్స్ మెంట్ చేసాడు.

Akhil Akkineni priya prakash varrier Pair Looks Good in Shopping mall Ad

ఇక ఇప్పుడు ఈయ‌న ప్రియా వారియ‌ర్ తో క‌లిసి చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ అదిరిపోయింది. ఇందులో ఇద్ద‌రి జోడీకి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తుంది. అమ్మ‌డు ఈ యాడ్ కోసం భారీగానే వ‌సూలు చేసింది. అఖిల్ ఎప్ప‌ట్నుంచో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. ఈ జోడీని సినిమాలో క‌లిసి చూపించ‌లేక‌పోయినా.. యాడ్ లో చూపించ‌డం మాత్రం అదిరిపోయింది. పైగా లుక్స్ వైజ్ గా ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ్డారు. ఇప్పుడు టీవీల్లో కూడా ప్లే అవుతున్న ఈ యాడ్ చూసి ఖచ్చితంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు జ‌నాలు మ‌రింత పోటెత్త‌డం ఖాయం. అస‌లే ద‌స‌రా సీజ‌న్ వ‌స్తుంది క‌దా.. ఖచ్చితంగా దీనిపై అఖిల్, ప్రియా ప్ర‌భావం ఉంటుంది.

More Related Stories