English   

రికార్డులు తిర‌గ‌రాస్తున్న అర‌వింద స‌మేత‌.. 

Aravinda-Sametha
2018-10-04 11:46:27

అర‌వింద స‌మేత వ‌స్తూ వ‌స్తూనే రికార్డులు తిర‌గ‌రాస్తున్నాడు. రేపు విడుద‌లైన త‌ర్వాత ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ ముందుగానే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మాత్రం అరాచ‌కం చేస్తున్నాడు జూనియ‌ర్. ఎందుకో తెలియ‌దు కానీ ఇప్పుడు అర‌వింద స‌మేత‌పై ఎక్క‌డ లేని అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ట్రైల‌ర్ రొటీన్ గానే ఉంద‌నే టాక్ వ‌చ్చినా కూడా ఒక్క రోజులోనే ఆల్  టైమ్ రికార్డులు సెట్ చేస్తున్నాడు నంద‌మూరి చిన్నోడు. విడుద‌లైన ఒక్క‌రోజులో వ‌చ్చిన లెక్క‌ల ప్ర‌కారం చూస్తుంటే బాహుబ‌లి 2 మాత్ర‌మే అర‌వింద స‌మేత కంటే ముందుంది. రాజ‌మౌళి అద్భుతం ఒక్క‌రోజులో 21.8 మిలియ‌న్ వ్యూస్ తో పాటు 4 ల‌క్ష‌ల 97 వేల లైకులు సాధించింది. 

ఇక ఇప్పుడు అర‌వింద స‌మేత ఒక్క‌రోజు 7 మిలియ‌న్ క్రాస్ చేసి ఇంకా ప‌రుగులు తీస్తుంది. లైక్స్ కూడా 3 ల‌క్ష‌ల 31 వేల‌కు చేరిపోయాయి. ఎన్టీఆర్ స్టామినాకు ఇంత‌కంటే నిద‌ర్శ‌నం అవ‌స‌రం లేదేమో..? ఈయ‌న రేంజ్ సోష‌ల్ మీడియాలో మ‌రోస్థాయికి వెళ్లిపోయింది. దీనికంటే ముందు అజ్ఞాత‌వాసి రికార్డ్ ఉండేది. దానికి ఒక్క‌రోజులో 5.9 మిలియ‌న్ వ్యూస్ తో పాటు 2 లక్ష‌ల 72 వేల లైకులు వ‌చ్చాయి. జై ల‌వ‌కుశ 40 ల‌క్ష‌ల 62 వేల వ్యూస్.. రంగ‌స్థ‌లం 46 ల‌క్ష‌ల వ్యూస్.. డిజే 40 ల‌క్ష‌ల 7 వేల వ్యూస్.. భ‌రత్ అనే నేను 36 ల‌క్ష‌ల 80 వేల వ్యూస్ ఒక్క రోజులో సాధించాయి. ఇప్పుడు ఇవ‌న్నీ దాటి రెండోస్థానంలో ఉన్నాడు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. మ‌రి రేపు విడుద‌లైన త‌ర్వాత రికార్డులు కూడా ఇలాగే వ‌స్తాయేమో చూడాలి. అక్టోబ‌ర్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది ఈ చిత్రం.

More Related Stories