English   

రెండు భాగాల్లో ఎన్టీఆర్ బ‌యోపిక్.. 

NTR-Biopic
2018-10-04 12:02:58

ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఎంద‌కుంటే ఎన్టీఆర్ అంటే ఒక్క‌డు కాదు.. తెలుగు జాతి చ‌రిత్ర‌. ఆయ‌న జీవితం తెరిచిన పుస్త‌కం. ఆ పుస్త‌కంలో ఆయ‌న‌తో పాటు ఇంకా ఎన్నో వంద‌ల పేజీలు ఉన్నాయి. అందులో కొన్ని చీక‌టి కోణాలు కూడా ఉన్నాయి. మ‌రిన్ని వెలుగు అక్ష‌రాలున్నాయి. ఇప్పుడు అవ‌న్నీ బ‌య‌టికి వ‌స్తాయా.. లేదంటే కేవ‌లం వెలుగు మాత్ర‌మే చూపించి చీక‌టిని వ‌దిలేస్తారా అనేది ఆస‌క్తి క‌రంగా మారింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌తీ సంఘ‌ట‌న‌ను కూడా చూపిస్తార‌ని తెలుస్తుంది. అందుకే రెండు భాగాల్లో ఈ సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు అని తొలి భాగాన్ని.. ఎన్టీఆర్ ప్ర‌జానాయ‌కుడు అని రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తుంది. రెండూ త‌క్కువ గ్యాప్ లోనే విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు క్రిష్. 

ఎన్టీఆర్ అంటే సినిమాల్లోనే కాదు.. రాజ‌కీయాల్లో కూడా రాజే. ఆయ‌న్ని యుగ‌పురుషుడు అంటారు. పార్టీ పెట్టిన 9 నెల‌ల‌కే సిఎం పీఠాన్ని అధిష్టించి ఔరా అనిపించారు అన్న‌గారు. అలాంటి వ్య‌క్తి జీవితం అంటే అంద‌రికీ ఆస‌క్తే. పైగా అందులో ఆయ‌న త‌న‌యుడు బాల‌య్యే హీరోగా న‌టిస్తుండ‌టం మ‌రింత ఆస‌క్తిక‌రం. ఎన్టీఆర్ సినిమా జీవితం వ‌ర‌కు ఆయ‌న హీరోనే. కానీ పాలిటిక్స్ లో మాత్రం క‌చ్చితంగా ఆయ‌న కొంద‌రికి విల‌న్ కూడా. ముఖ్యంగా అప్ప‌ట్లో కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఎన్టీఆర్ తో చాలా పెద్ద‌యుద్ధం చేసారు. పొలిటిక‌ల్ లీడ‌ర్ గా ఆయ‌న‌లో పాజిటివ్ తో పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవి బ‌య‌టికి తీసుకొచ్చేంత స‌త్తా బాల‌య్య చేసే బ‌యోపిక్ కు ఉందా అని అడుగుతున్నారు విశ్లేష‌కులు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో చంద్ర‌బాబుదే కీ రోల్. త‌న అల్లుడే త‌న‌ను మోసం చేసాడంటూ చ‌నిపోయే ముందు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు ఎన్టీఆర్. 

హీరోగా ప్ర‌యాణం చూపించి.. సిఎం కావ‌డంతో తొలి భాగం ముగుస్తుంద‌ని.. అప్ప‌ట్నుంచి రాజ‌కీయాల‌ను రెండో భాగంలో చూపించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఆయ‌న రాజ‌కీయ జీవితంలో అల్లుడే విల‌న్. మ‌రి ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో వియ్యంకుడినే విల‌న్ గా చూపించే ధైర్యం ఉందా..? ఈ పాత్ర‌లో రానా న‌టిస్తున్నాడు. మ‌రి ఆయ‌న పాత్ర‌ను ఎలా చూపించ‌బోతున్నారు..? అస‌లు ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎక్క‌డ మొద‌లై.. ఎక్క‌డ ఎండ్ అవుతుంది..? ఆయ‌న జీవితంలోని రెండో కోణం చూపించ‌క‌పోతే బ‌యోపిక్ చేసి లాభం లేదంటున్నారు కొంద‌రు. అందుకే అన్నీ చూపించాల‌ని బాల‌య్య కూడా ఫిక్స్ అయిపోతున్నాడు. అస‌లు ఎన్టీఆర్ జీవితం మొద‌లు అయిందే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌. అప్ప‌ట్నుంచే ఆయ‌న జీవితం చాలా మ‌లుపులు తిరిగింది. చూడాలిక‌.. చివ‌రికి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో..? వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానుంది. 

More Related Stories