English   

కోర్ట్ మెట్లెక్కిన సుదీప్.. పాపం భార్య క‌ష్టాలు.. 

Sudeep-Divorce-Case
2018-10-04 15:06:44

హీరోల ప్రొఫెష‌న‌ల్ లైఫ్ ఎలా ఉన్నా ఈ మ‌ధ్య ఎక్కువ‌గా ప‌ర్స‌న‌ల్ లైఫ్ తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా క‌న్నడ‌ హీరోల‌కు ఈ క‌ష్టాలు ఎక్కువగా వ‌స్తున్నాయి. ఆ మ‌ధ్య ద‌ర్శ‌న్ భార్య విడాకుల కోసం చాలానే ప్ర‌య‌త్నించింది. ఇక ఇప్పుడు ఇదే తిప్ప‌లు సుదీప్ కు కూడా వ‌చ్చాయి. ఈ గొడ‌వ గ‌త ఏడాదిగా న‌డుస్తూనే ఉంది. ఈ కేస్ లో ఇప్ప‌టికే కోర్ట్ చాలా సార్లు సుదీప్ ను ప్ర‌శ్నించింది. అయితే ఏకంగా తొమ్మిది సార్లు కోర్టుకు రాలేదు సుదీప్. రాలేని ప్ర‌తీసారి షూటింగ్ బిజీ వ‌ల్ల రాలేక‌పోయాన‌ని కోర్టుకు చెబుతున్నాడు. 17 ఏళ్ల కిందట బెంగుళూరులో ప్రియ రాధాకృష్ణన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుదీప్. కొన్ని రోజులు సహజీవనం చేసిన త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కారు. ఎయిర్ లైన్స్ లో ఉద్యోగి అయిన ప్రియ 2001 అక్టోబర్ లో సుదీప్ ను పెళ్లి చేసుకుంది. వీళ్ల‌కు 11ఏళ్ల శాన్వి అనే పాప కూడా ఉంది. అయితే ఆ మ‌ధ్య సుదీప్, ప్రియ మధ్య విభేదాలు తొలగిపోయాయి. వారిద్దరూ మళ్లీ కలువనున్నారనే వార్తను ఈ మ‌ధ్యే ఓ ప‌త్రిక క‌న్ఫ‌ర్మ్ చేసింది. 

కాగా సుదీప్, ప్రియ కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు రాక‌పోతే తామే స్వ‌యంగా విడాకులు మంజూరు చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తుంది కోర్ట్. అయితే అంతా బాగుంది అనుకుంటున్న టైమ్ లో ఇప్పుడు మ‌ళ్లీ ఇద్ద‌రూ ప‌రస్ప‌ర అంగీకారంతో విడాకులు కావాల‌ని కోర్టుకు విన్నవించుకున్న‌ట్లు తెలుస్తుంది. దీనికి కోర్ట్ కూడా స‌మ్మ‌తించింద‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అస‌లు సుదీప్, ప్రియా మ‌ధ్య చిచ్చు రేగ‌డానికి కార‌ణం నటి నిత్యామీనన్ అని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. ఈమెతో సుదీప్ ప్రేమ‌లో ప‌డ‌టం.. ఆ త‌ర్వాత ఎఫైర్ సాగించ‌డం వ‌ల్లే విడాకుల వ‌ర‌కు వ్య‌వ‌హారం వ‌చ్చింద‌నేది క‌న్న‌డ‌నాట వినిపిస్తోన్న క‌థ‌నం. విడాకుల కేసు ఓ పక్క న‌డుస్తుండ‌గా మరోవైపు నిత్యతో అఫైర్ జోరుగా సాగుతుందనే రూమర్ ప్రచారంలో ఉంది. ఆ మ‌ధ్య కేఎస్ రవికుమార్ తెర‌కెక్కించిన ముదింజ ఇవాన పుడిలో సుదీప్, నిత్య జంట‌గా న‌టించారు. అయితే భార్యతో విడాకులు.. అఫైర్ తదితర అంశాలపై స్పందించాలని మీడియా కోరగా సుదీప్‌ నిరాకరించారు. వ్యక్తిగత సమస్యలను ప్ర‌స్థావించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పాడు. అయితే భార్య‌తో విడిపోవ‌డానికి ఆమెకు ఏకంగా 19 కోట్లు ఇవ్వ‌డానికి సుదీప్ రెడీ అయిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 

More Related Stories