English   

సంక్రాంతికి హీరో.. రిపబ్లిక్ డే కు పొలిటీషియన్

NTR-Kathanayakudu
2018-10-04 17:55:35

అతను కథగా మారితే, 'కథానాయకుడు'..
అతనే ఓ చరిత్రయితే, 'మహానాయకుడు'...

ఈ రెండు స్టేట్మెంట్స్ వెనక చాలా పెద్ద కథ ఉంది. అందుకే ఆ కథను రెండు భాగాలుగా చేశారు. అది ఈ స్టేట్మెంట్స్ గా మారడమే కాదు.. కథాగమనాన్ని సైతం తెలియజేస్తోంది. యస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న మోస్ట్ అవెయిటెడ్ బయోపిక్ ‘‘ఎన్టీఆర్’’. నిన్నటి వరకూ కామ్ గా షూటింగ్ చేస్తూ వస్తోన్న క్రిష్ సడెన్ గా షాక్ ఇచ్చాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఫస్ట్ పార్ట్ ముందు నుంచీ చెబుతున్నట్టుగానే 2019జనవరి 9న విడుదల చేస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాకు టైటిలే ఆ మొదటి స్టేట్మెంట్.. అంటే ‘‘ఎన్టీఆర్ కథానాయకుడు’’.

ఈ పార్ట్ లో ఎన్టీఆర్ నట జీవితంపై ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట. అంటే ఆయన బాల్యం నుంచీ నటుడుగా మారడంతో పాటు మహానటుడుగా ఆంధ్రుల ఆరాధ్య నటుడుగా మారడం వరకూ ఈ భాగంలో ఉంటుంది. ఆ భాగమే సంక్రాంతిక వస్తుంది. అంటే హీరో పార్ట్ అన్నమాట.నటుడుగా చరిత్ర సృష్టించిన ఆ కథా నాయకుడు... మహానాయకుడుగా మారిన వైనాన్ని రెండో భాగంలో చూపిస్తారన్నమాట.  ఇందులో ఆయన పొలిటికల్ ఎంట్రీ.. అసలు పార్టీ పెట్టడానికి కారణాలతో పాటు రాజకీయ నాయకుడుగా ఆయన సృష్టించిన సంచనాలు.. చరిత్ర.. ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకే ఈ భాగానికి ‘‘ఎన్టీఆర్ మహానాయకుడు’’ అనే టైటిల్ పెట్టారు.

ఇక ఆశ్చర్యం ఏంటంటే.. ఈ నాయకుడికీ, మహానాయకుడికీ విడుదలలో పెద్దగా తేడా లేదు. యస్.. ఒక పార్ట్ వచ్చిన మళ్లీ ఎన్నాళ్లకో మరో పార్ట్ అన్నట్టు కాకుండా.. జనవరి 9న కథానాయకుడు వస్తోంటే.. జనవరి 24న రిపబ్లిక్ డే సందర్భంగా మహానాయకుడు రాబోతున్నాడు. అంటే కేవలం 15రోజుల వ్వవధిలోనే రెండో భాగం కూడా వస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల ఆడియన్స్ లో కంటిన్యూటీ విషయంలో కన్ఫ్యూజన్స్ ఉండవు. పైగా ఆ నెలంతా ఎన్టీఆర్ దే అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఆకట్టుకుంటే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కు మరింత బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయ్..

More Related Stories