English   

ఎన్టీఆర్... సింపుల్ గా చింపేశాడంతే

Aravindha-Sametha
2018-10-04 20:05:51

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అరవింద సమేత వీరరాఘవ విడుదలకు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రైస్ కోట్ చేసింది. దాదాపు 95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందీ సినిమా. నిజంగా ఈ మొత్తం ఎన్టీఆర్ రీ కలెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అతను మరో రేంజ్ కు వెళతాడు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘అనగనగనగా’ పాట వీడియో ప్రోమో సాంగ్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ కూడా ఇదే. మెల్లగా ఆకట్టుకుంటూ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట వీడియో సాంగ్ మరింత ఆశ్చర్యంగా ఉంది. 

అనగనగనగా అరవిందట తన పేరూ అంటూ సాగే ఈ పాట రీసెంట్ గా చిత్రీకరించారు. అంటే ఎన్టీఆర్ తండ్రి మరణం తర్వాత. అయినా సరే అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టాడు. నిజానికి ఈ పాటను మాంటేజ్ సాంగ్ అనుకున్నారు చాలామంది. బట్.. తన క్యూట్ స్టెప్పులతో సింపుల్ గా చింపేశాడు ఎన్టీఆర్. దీన్ని బట్టి.. ఇలాంటి ఆల్బమ్ లో ఎన్టీఆర్ స్టెప్పులు మిస్ అవుతాం అనుకున్న ఫ్యాన్స్ కు ఈ పాటతో ఆన్సర్ చెప్పాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఫేస్ లో కాస్త బాధ కనిపిస్తోన్నా.. డ్యాన్స్ లో గ్రేస్ మాత్రం అద్దిరిపోయింది. మొత్తంగా అందానికి సొంతూరైన అరవింద కోసం ఆయన వేసిన స్టెప్పులు అమ్మడి మనసును కరిగిస్తాయోమో.. 

More Related Stories