English   

దసరాకు అల్లు అర్జున్ స్టార్ట్ చేస్తాడా..?

Allu Arjun Dilemma to Choose Director After Naa Peru Surya Disaster
2018-10-04 22:03:27

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఈ సినిమా తర్వాత ఎందుకో ఎప్పుడూ లేనిది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాగా డిస్ట్రబ్ అయ్యాడు. ఇంతకంటే భారీ ఫ్లాపులు కూడా చూసిన అర్జున్ కు ఈ సినిమా షాక్ ఇచ్చింది. యస్.. వక్కంతం వంశీ డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చిన ఈ మూవీతో మనోడు చాలా డిప్రెస్ అయ్యాడు కూడా. పైగా అంతకు ముందు చేసిన సినిమాలు హిట్టయినా.. పరమ రొడ్డకొట్టుడు సినిమాలుగానే తేల్చారు ఆడియన్స్. ఇటు చూస్తే ప్రతి హీరో మారుతున్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారు. బట్ బన్నీ విషయంలో ఇది లేదు. అందుకే తను కూడా మారాలనుకున్నాడు. ఈ కారణంగానే ఆరు నెలలకు పైగా సినిమాలేవీ ఒప్పుకోకుండా.. స్టఫ్ ఉన్న సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో అతనితో సినిమాలు చేస్తున్నారు అంటూ కొందరు దర్శకులు పేర్లు కూడా వినిపించాయి. ఇందులో విక్రమ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. బట్ ఫైనల్ గా అతనికీ తూఛ్ అన్నాడు బన్నీ. ఇక ఇన్నాళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టే టైమ్ వచ్చింది. త్వరలోనే అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది.

అల్లు అర్జున్ ఇన్నాళ్లూ ఎదురు చూసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం. ఈ టైమ్ లో అతను ఎన్టీఆర్ తో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా అయిపోయింది. ఈ నెల 11న విడుదల కాబోతోంది కూడా. దీంతో ఇక బన్నీ సినిమాపై దృష్టిపెట్టబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాకు సంబంధించి కథ కూడా ఫైనల్ అయిందనే మాటలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. సో.. అన్నీ కుదిరితే ఈ నెల మూడోవారంలో.. అంటే దసరా రోజున కానీ దసరా సందర్భంగా కానీ వీరి కాంబినేషన్ లో సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారని సమాచారం. మొత్తంగా అర్జున్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న డేట్ వచ్చింది. ఇప్పటికే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్స్ అయ్యాయి. కాబట్టి ఇక వీరు హ్యాట్రిక్ కొట్టడం కోసం కష్టపడాలి.

More Related Stories