English   

వామ్మో కౌశల్ ఆర్మీ మాములుగా లేదు

Bigg boss telugu 2 winner Kaushal going to enter in guinnes book world record
2018-10-05 06:52:28

జనం త‌లుచుకుంటే కానిది ఏమీ లేదు. అంతా అవును అనాల్సిందే. అనామ‌కున్ని కూడా అసాధ్యుడిగా మార్చేసారు ఈ జ‌నం. ఇప్పుడు కౌశ‌ల్ దీనికి నిద‌ర్శ‌నం. బిగ్ బాస్ 2 రేటింగ్ త‌క్కువ‌గా ఉండొచ్చు కానీ కౌశ‌ల్ ఓటింగ్ మాత్రం కాదు. ఇప్పుడు ఈయ‌న ఇండియ‌న్ రికార్డ్ కాదు ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. న‌మ్మ‌డానికి ఇది క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఒక‌టి రెండు కాదు.. బిగ్ బాస్ ఫైన‌ల్లో ఈయ‌న‌కు ఏకంగా 32 కోట్ల ఓట్లు వ‌చ్చాయి. ఇండియాలోనే కాదు ప్ర‌పంచంలోనే ఏ రియాలిటీ షోలో కూడా ఓ వ్య‌క్తి కోసం ఇన్ని కోట్ల ఓట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌డ‌లేదు. అదే గిన్నీస్ రికార్డ్.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా కౌశ‌ల్ చెప్పాడు. తాజాగా ఈయ‌న ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వ‌స్తే ఆయ‌న్ని చూడ్డానికి ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డ్డారు. ఆ జ‌నాన్ని కంట్రోల్ చేయ‌డానికి పోలీసుల బ‌లం కూడా స‌రిపోలేదు. అదే ఓపెనింగ్ కు వ‌చ్చిన ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయ‌ల్ రాజ్ పుత్, కార్తికేయ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. వాళ్ల‌ను కాద‌ని అంతా కౌశ‌ల్ వైపు ప‌రుగులు తీసారు. దీన్నిబ‌ట్టి ఇప్పుడు మ‌నోడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఈయ‌న కోసం అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి. కౌశ‌ల్ ఆర్మీ అంటూ ర‌చ్చ చేసారు ఫ్యాన్స్. అస‌లు ఓ  వ్య‌క్తికి బిగ్ బాస్ తో ఇంత‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌స్తుందా అనుకుంటున్నారంతా.. కానీ వ‌చ్చింది. ఇప్పుడు ఈయ‌న కోసం ఇండ‌స్ట్రీ కూడా వేచి చూస్తుంది.

More Related Stories