English   

పాపం అదృష్టం లేని పవన్ హీరోయిన్

Pawan Kalyan’s Heroine Nikesha Patel Bikini Photos
2018-10-05 07:47:47

ఒక్కోసారి అదృష్టం మ‌రీ ఎక్కువొచ్చినా త‌ట్టుకోలేం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోయిన్ కు కూడా ఇదే పరిస్థితి. నికిషా ప‌టేల్ తొలి సినిమానే ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో న‌టించే అవ‌కాశం వ‌చ్చేస‌రికి.. నికిషా అదృష్టం ఏంటో అని అంతా కుళ్లుకున్నారు కూడా. కానీ ఏం చేస్తాం.. ఈ భామ న‌టించిన తొలి సినిమా పులి చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ గా మారింది. దాంతో నికీషాను క‌నీసం ప‌ట్టించుకోలేదు మన ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ అనే ముద్ర మిన‌హా ప‌వ‌ర్ స్టార్ నికీషా కెరీర్ కు ఏ ర‌కంగానూ హెల్ప్ కాలేదు. ఇప్ప‌టికీ ఈ భామ‌ను పులి హీరోయిన్ అనే అంటారు. గ‌తేడాది సాయిరాం శంక‌ర్ తో అర‌కురోడ్ లో అనే సినిమా చేసింది నికీషా. ఈ సినిమాలో ఏ మాత్రం సంకోచించ‌కుండా అందాలు ఆర‌బోసింది.

Pawan Kalyan’s Heroine Nikesha Patel Bikini Photos

కానీ ఏం లాభం.. సినిమా వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. దాంతో చేసేదేం లేక అందాల‌కు మెరుగులు దిద్దుకుంటుంది నికీషా ప‌టేల్. తాజాగా గుర్తు కూడా ప‌ట్ట‌నంత మేకోవ‌ర్ అయిపోయింది ఈ బ్యూటీ. బొద్దుగుమ్మ కాస్తా.. కాస్త బ‌రువు త‌గ్గింది. ఏకంగా ఈ బ్యూటీ బికినీ షో లో కూడా మెరిసింది. ఈ భామ కెరీర్ గాడిన ప‌డాలంటే పై నుంచి దేవుడు దిగివ‌చ్చి వ‌రాలు ఇవ్వాల్సిందే. అలా చేసినా కూడా పులి పిల్ల కెరీర్ ఒడ్డున ప‌డుతుందో లేదో మ‌రి..! ప్ర‌స్తుతం సినిమాలు లేవు కాబట్టి హాయిగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంది నికీషా. మరి ఇప్పుడు ఈ భామ‌కు అవ‌కాశం ఇచ్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో చూడాలి..! అస‌లు మ‌ళ్లీ స్క్రీన్ పై క‌నిపించే అవ‌కాశం ఉందో లేదో..? అది కూడా అనుమాన‌మే.. ఎందుకంటే ప‌వ‌న్ ఇచ్చిన డోస్ అలా ఉంది మ‌రి.

Pawan Kalyan’s Heroine Nikesha Patel Bikini Photos

Pawan Kalyan’s Heroine Nikesha Patel Bikini Photos

More Related Stories