English   

నోటా ఓవర్సీస్ వచ్చేసింది

Vijay Devarakonda’s NOTA Overseas Premiers Talk out
2018-10-05 08:09:26

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే ఇప్పుడు అంతా హిట్ అని ఫిక్సైపోతున్నారు. ఇలాంటి టైమ్ లో నోటా సినిమాతో వ‌చ్చాడు ఈయ‌న‌. పొలిటిక‌ల్ డ్రామా కాబ‌ట్టి ఈ చిత్రంపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పైగా ట్రైల‌ర్.. టీజ‌ర్.. విజువ‌ల్స్ కూడా అన్నీ అద్భుతంగా ఉండ‌టంతో ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందా అనే అంచ‌నాలు అంద‌ర్లోనూ క‌నిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓవ‌ర్సీస్ లో ఈ సినిమాకు భారీగా ప్రీమియ‌ర్ షోస్ ప‌డ్డాయి. అక్క‌డ్నుంచి వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం విజ‌య్ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చేలా ఉంది నోటా. అయితే టాక్ మాత్రం ఊహించినంత లేదు. ఈ చిత్రానికి టాక్ చాలా వీక్ గా వ‌చ్చింది.

ముఖ్యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ అనే ఒక్క పేరు త‌ప్ప ఈ సినిమాలో ఇంకేం లేదంటున్నారు ప్రేక్ష‌కులు. చాలా ఊహించుకుని థియేట‌ర్స్ కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు షాక్ ఇచ్చాడంటున్నారు ఫ్యాన్స్. పొలిటిక‌ల్ డ్రామా అయినా కూడా చాలా స్లోగా ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కించాడ‌ని.. సీరియ‌స్ డ్రామా కావ‌డంతో క‌నీసం కామెడీకి కూడా చోటు లేద‌ని.. అయితే స్క్రీన్ ప్లే లోపం వ‌ల్ల సినిమా చాలా వ‌ర‌కు మైన‌స్ పాయింట్స్ తో నిండిపోయింద‌ని చెబుతున్నారు ఆడియ‌న్స్. అయితే సినిమాలో చాలా వ‌ర‌కు ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై సెటైర్లు వేయ‌డంతో కొన్ని సీన్స్  బాగానే పేలాయ‌ని తెలుస్తుంది. ఓవ‌రాల్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంత సేవ్ చేయ‌డానికి ట్రై చేసినా కూడా నోటా బ‌య‌ట ప‌డ‌టం మాత్రం కాస్త క‌ష్టంగానే క‌నిపిస్తుంది. మ‌రి ద‌స‌రా హాలీడేస్ ప్ల‌స్ విజ‌య్ స్టామినాతో సినిమా ఎంత‌వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

More Related Stories