English   

ఒకేరోజు ముగ్గురు స్టార్ హీరోలు వ‌చ్చారా..? 

chiru-mahesh
2018-10-05 12:20:20

అస‌లు ఒక్క‌రోజు ముగ్గురు స్టార్ హీరోలు ఎప్పుడైనా వ‌స్తారా..? అప్పుడెప్పుడో మిలీనియం కొత్తలో చిరంజీవి, బాల‌య్య‌, వెంక‌టేశ్ త‌మ సినిమాల్తో సంక్రాంతికి వ‌చ్చారు. అయితే అక్టోబ‌ర్ 4 మాత్రం ఎందుకో తెలియ‌దు కానీ కొంద‌రు హీరోల‌కు మాత్రం చాలా ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. ఆ రోజు వాళ్ల కెరీర్ ను మార్చేసిన సినిమాలు విడుద‌ల‌య్యాయి. ముఖ్యంగా నాగార్జున అయితే 22 ఏళ్ల కింద అక్టోబ‌ర్ 4న మాయ చేసాడు. టాలీవుడ్ ను మ‌రో కొత్త పుంత‌లు తొక్కించాడు. ఆ మాయ పేరు నిన్నే పెళ్లాడ‌తా. నాగార్జున‌, ట‌బు జంట‌గా వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో రికార్డులు తిర‌గ‌రాసింది. ఈ చిత్రంతోనే నాగ్ మార్కెట్ రెండు కాదు ప‌దింత‌లు పెరిగిపోయింది. ఇక ఇదే అక్టోబ‌ర్ 4న మ‌హేశ్ బాబు జీవితాన్ని మార్చేసిన సినిమా వంశీ వ‌చ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా హిట్ కాంబినేష‌న్ క‌లిసింది జీవితంలో. 

ఆ కాంబినేష‌న్ పేరు న‌మ్ర‌తా శిరోద్క‌ర్. అందుకే వంశీ ఫ‌లితంతో ప‌ని లేకుండా మ‌హేశ్ కు ఎప్పుడూ ప్ర‌త్యేకమైన సినిమానే. 2000, అక్టోబ‌ర్ 4న విడుద‌లైంది ఈ చిత్రం. ఇందులో కృష్ణ కూడా ఉన్నాడు. బి గోపాల్ ద‌ర్శ‌కుడు. ఇక 17 ఏళ్ల కింద ఇదే అక్టోబ‌ర్ 4న డాడి సినిమా విడుద‌లైంది. చిరంజీవికి అప్ప‌టి వ‌ర‌కు మాస్ ఇమేజ్ బ్ర‌హ్మాండంగా ఉండేది. కానీ సురేష్ కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్ష‌కుల‌ను క‌న్నీరు పెట్టించింది. సినిమా కోరుకున్న విజ‌యం సాధించ‌లేదు కానీ డాడి మాత్రం చిరుకు ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. ఇందులో పాప న‌ట‌న‌తో పాటు ఎమోష‌న‌ల్ సీన్స్ క‌న్నీరు పెట్టించాయి. మొత్తానికి ఈ మూడు సినిమాలు ఒకే రోజు వ‌చ్చాయంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే. ఒక‌టి 22 ఏళ్లు.. ఒక‌టి 18 ఏళ్లు.. మ‌రోటి 17 ఏళ్లు పూర్తి చేసుకుని ఇప్ప‌టికీ తాజాగానే అనిపిస్తున్నాయి. 

More Related Stories