English   

మంచుల‌క్ష్మితో ర‌కుల్ స్పెష‌ల్ ప్లాన్

Rakul Preet Singh Birthday Celebrations Will Plan With Manchu Lakshmi
2018-10-05 13:04:50

ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండ‌స్ట్రీని వ‌దిలేసింది కానీ ఇక్క‌డి స్నేహితుల‌ను మాత్రం కాదు. ప్ర‌స్తుతం ఈమె త‌మిళ‌, హిందీ సినిమాల‌తో బిజీగా ఉన్నా కూడా వ‌ర‌స‌గా ఇక్క‌డి ఫ్రెండ్స్ తో అయితే ట‌చ్ లోనే ఉంది. ఇప్పుడు కూడా త‌న బ‌ర్త్ డే సంబ‌రాల‌ను వారం రోజుల ముందే చేసుకుంది ఈ భామ‌. ప్ర‌స్తుతం ఈమె కార్తి దేవ్ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన తన షెడ్యూల్ పూర్త‌యింది. దాంతో వెళ్తూ వెళ్తూ త‌మ హీరోయిన్ ను ఉట్టి చేతుల‌తో ఏం పంపిస్తాంలే అని.. అక్టోబ‌ర్ 10న రావాల్సిన ర‌కుల్ బ‌ర్త్ డేను వారం రోజుల ముందుకు తీసుకొచ్చారు. కేక్ క‌ట్ చేయించి హ్యాప్ బ‌ర్త్ డే పాట కూడా పాడేసారు. తొంద‌ర‌ప‌డి ఓ కోయిల రెండు రోజుల ముందు కూస్తుంది కానీ మ‌రీ వారం రోజుల ముందే కూయ‌డం ఏంటో మ‌రి..? ఖాకీ త‌ర్వాత కార్తితో రెండోసారి ర‌కుల్ న‌టిస్తున్న సినిమా ఇది. దేవ్ ఇదే ఏడాది విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే త‌న బ‌ర్త్ డే సంబరాల‌ను మంచు ల‌క్ష్మి తో ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసింది ర‌కుల్. ఇక్క‌డ షూటింగ్ అయిపోయింది.. వ‌చ్చేస్తున్నా ల‌క్ష్మి అంటూ ట్వీట్ చేసింది ర‌కుల్. ఈ ఇద్ద‌రూ బాగా ఘాడ‌మైన స్నేహితులు. అన్న‌ట్లు మంచు కుటుంబం వారి క‌రెంట్ తీగ సినిమాతోనే ఈమె కాస్త బ‌య‌టికి బాగా తెలిసింది. ఆ స‌మ‌యంలోనే ల‌క్ష్మితో ఈమెకు ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డింది. అప్ప‌ట్నుంచి ఎప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చినా కూడా ల‌క్ష్మితో క‌లిసి ఉండ‌టం ఈమెకు అల‌వాటుగా మారింది. ఇప్పుడు త‌న బ‌ర్త్ డేను కూడా మంచి కుటుంబంతోనే ప్లాన్ చేస్తుంది ఈ భామ‌. మ‌రి చూడాలిక‌.. వీళ్ల స్పెష‌ల్ ప్లానింగ్ ఎలా ఉండ‌బోతుందో మ‌రో వారం రోజుల్లో తేల‌నుంది. అన్న‌ట్లు ఈమె తెలుగులో బాబీ తెర‌కెక్కిస్తున్న వెంకీమామ‌లో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించ‌నుంది. ఇందులో వెంక‌టేశ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.

More Related Stories