English   

విజయ్ దేవరకొండకు ఫస్ట్ షాక్ అనుకోవచ్చా..?

NOTA-shock
2018-10-05 17:22:26

సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలు అనుకున్నంత సులువు కాదు. క్రేజ్ ఉంటే ఓపెనింగ్స్ వస్తాయి కానీ.. యావరేజ్ సినిమాను మంచి సినిమాగా మార్చలేవు. ఈ విషయం ఇవాల్టితో ఫస్ట్ టైమ్ అర్థమై ఉంటుంది విజయ్ దేవరకొండకు. ప్రస్తుతం టాలీవుడ్ నయా స్టార్ గా చెప్పుకుంటోన్న విజయ్ దేవరకొండ చేసిన నోటా విడుదలైంది. ఇప్పటికే వరుస విజయాలతో అతి తక్కువ టైమ్ లోనే ఏకంగా వంద కోట్ల క్లబ్ లో ఎంటర్ అయి సంచలనం సృష్టించాడు. మామూలుగా కాస్త హైపర్ గా మాట్లాడే విజయ్ కి ఈ విజయాలు కాన్ఫిడెన్స్ ను కాస్త ఓవర్ చేశాయి. దీంతో తను ఏం చేసినా చూస్తారు అన్న నమ్మకం వచ్చినట్టు అతని ప్రతి ఇంటర్వ్యూలో నూ కనిపిస్తోంది. కానీ క్రేజ్ కంటే కంటెంట్ ముఖ్యం అని ఇవాళ అర్థమైంది. ఈ శుక్రవారం వచ్చిన ‘నోటా’కు పూర్తిగా నెగెటివ్ మార్కులు పడుతున్నాయి. దర్శకుడి కన్ఫ్యూజన్ కు తోడు విజయ్ దేవరకొండ ఇమేజ్ ను బ్యాలన్స్ చేయడంలో జరిగిన పొరబాట్లన్నీ నోటాకు మైనస్ గా మారాయి. 

విజయ్ ఇమేజ్ కు నోటాకు మధ్య కనెక్షన్ సరిగా లేకపోవడంతో ఈ సినిమా ఆడియన్స్ కు చేరడంలోనూ కట్ అవుతుందంటున్నారు. మరోవైపు హీరో అంటే కేవలం తన పాత్రను మాత్రమే కాక ఇతర పాత్రల విషయంలో.. ముఖ్యంగా హీరోయిన్ మేటర్ లోనూ కొంత చొరవ చూపించాలి. కానీ ఇందులో అలాంటివేం కనిపించలేదు. ఏదేమైనా నోటా విజయ్ దేవరకొండకు స్టార్డమ్ వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే తగిలిన ఫస్ట్ షాక్. ఇలాంటి షాకులు ఎంత తగ్గించుకుంటే రేంజ్ అంత పెరుగుతుంది.. మరి ఈ సగం విజయం పై విజయ్ దేవరకొండ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories