English   

నిఖిల్ ఓల్డ్ సిటీలో ఏం చేస్తున్నాడు..? 

Nikhil-Siddharth
2018-10-05 17:45:27

అవును.. నిఖిల్ అక్క‌డేం చేస్తున్నాడు..? అస‌లు అక్క‌డ ఆయ‌న‌కేం ప‌ని ఉంది..? ఇలాంటి అనుమానాలు మీకు కూడా వ‌స్తున్నాయి క‌దా.. కానీ ఇప్పుడు నిఖిల్ అక్క‌డే ఉన్నాడు. కొన్ని రోజులు అక్క‌డే ఉండ‌బోతున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న ముద్ర సినిమా షూటింగ్ ఓల్డ్ సిటీలోనే నాన్ స్టాప్ గా జ‌రుగుతుంది. అక్క‌డే ఓ పాత బంగ‌ళాలో కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు టిఎన్ సంతోష్. త‌మిళ‌నాట హిట్ అయిన క‌ణిత‌న్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నాడు నిఖిల్. న‌కిలి స‌ర్టిఫికేట్ల నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వ‌చ్చింది. 

అయితే ఇది రెండేళ్ల కింద వ‌చ్చిన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లుక్ ను గుర్తుకు తెస్తుంది. అప్ప‌ట్లో ఆ చేతుల్లో ఆత్మ‌కు సంబంధించిన సీసా ఉండేది ఇప్పుడు కెమెరా వ‌చ్చింది అంతే తేడా. అది తెలియ‌కుండా అలా జ‌రిగిపోయిందా లేదంటే నిఖిల్ కావాల‌నే సెంటిమెంట్ గా అలా లుక్ డిజైన్ చేయించుకున్నాడా అనేది మాత్రం తెలియ‌దు. కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ ఎక్క‌డ జ‌రుగుతుందో కూడా తెలియ‌దు. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. ఈ వారంలోనే ముద్ర ఫ‌స్ట్ లుక్ తో పాటు మ‌రికొన్ని వివ‌రాలు కూడా చెబుతామ‌ని చెప్పాడు ఈ కుర్ర హీరో. ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నాడు. కిరాక్ పార్టీతో గాడిత‌ప్పిన నిఖిల్.. ఈ చిత్రంతో మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? 

More Related Stories