English   

క్రిష్ వ‌ర్సెస్ క్రిష్.. ఇదేం అరాచకం..?

Krish-NTR
2018-10-05 18:33:08

త‌న సినిమాతో త‌నే పోటీ ప‌డ‌టానికి ఏ ద‌ర్శ‌కుడైనా సిద్ధప‌డ‌తాడా..? అస‌లు అలా చేయ‌డానికి ఏ ద‌ర్శ‌కుడైనా ఒప్పుకుంటాడా..? ఎహే అలా జ‌ర‌గాలి అంటే ముందు ఒకేసారి ఓ ద‌ర్శ‌కుడి నుంచి రెండు సినిమాలు రావాలి క‌దా.. అంత ద‌మ్ము ఉన్న ద‌ర్శ‌కులు ఇప్పుడు ఎక్క‌డున్నారు అనుకుంటున్నారా..? ఉన్నాడు.. నేను ఉన్నానంటూ క్రిష్ దుమ్ము లేపేస్తున్నాడు. ఈయ‌న ఒకేసారి ఒక్క‌రోజు గ్యాప్ లో రెండు సినిమాల‌తో వ‌స్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. జ‌న‌వ‌రి 24న ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు.. 25 మ‌ణిక‌ర్ణిక సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఈ రెండు సినిమాల‌కు ద‌ర్శ‌కుడు క్రిష్. కంగ‌న ర‌నౌత్ న‌టించిన ఈ చిత్రం బాలీవుడ్ లో విడుద‌ల అవుతుంది కాబ‌ట్టి తెలుగులో పోటీ ఎలాగూ ఉండ‌దు. 

ఇక్క‌డ ఎన్టీఆర్ సినిమాకు ఏది వ‌చ్చినా పెద్ద‌గా పోటీలో నిల‌బ‌డ‌దు. అందుకే క్రిష్ కూడా దీనికి ఒప్పుకున్నాడు. ఈ ఏడాదే రావాల్సిన ఈ చిత్రం అనుకోని కార‌ణాల‌తో ఆల‌స్యం అవుతూనే వ‌చ్చింది. చివ‌రికి జ‌న‌వ‌రి 25న ఫిక్స్ అయింది. ఇక జ‌న‌వ‌రి 24న ఎన్టీఆర్ రెండో భాగం మ‌హానాయ‌కుడు విడుద‌ల కానుండ‌టం కూడా అద్బుత‌మే. అంతేకాదు.. కేవ‌లం 15 రోజుల గ్యాప్ లోనే మూడు సినిమాల‌తో వ‌స్తూ ఈ త‌రంలోనే ఏ ద‌ర్శ‌కుడికి సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంటున్నాడు క్రిష్. మ‌రి ఈ మూడు సినిమాలు ఎలా ఉండ‌బోతున్నాయో..? అస‌లు ఎన్టీఆర్ రెండు భాగాలుగా చేసి క్రిష్ ఎంత మాయ చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories