English   

సర్కార్ కే వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

AR-Murugadoss
2018-10-05 18:55:31

కొన్నిసార్లంతే.. ఎంతో కష్టపడి సినిమా తీస్తారు. వీళ్లు చాలా ఇంట్రెస్టింగ్ అనుకున్న పాయింట్స్ అన్నీ వీళ్లకు తెలియకుండానే మీడియాలో వచ్చేస్తుంటాయ్. అరే ఇలా ఎలా జరిగిందీ అనుకునేలోపే డ్యామేజ్ అయిపోతుంది. ఇదంతా కొందరి అత్యుత్సాహం వల్లే జరుగుతుందని వేరే చెప్పక్కరలేదు. ఇప్పుడు కోలీవుడ్ లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘సర్కార్’ విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో తన ఎంటైర్ టీమ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దర్శకుడు మురుగదాస్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుపుకుంటోంది. నిజానికి ఈ దసరా సందర్భంగా విడుదల చేయాలనే టార్గెట్ గా షూటింగ్ కు వెళ్లారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో తమిళనాట మరో బిగ్గెస్ట్ ఫెస్టివ్ గా ఉన్న దీపావళికి పోస్ట్ పోన్ చేశారు. అప్పటికి కూడా వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. మొత్తంగా ఈ మధ్య ఈ మూవీకి లీకుల బెడద ఎక్కువైంది. మొన్నటి వరకూ షూటింగ్ స్పాట్స్ వచ్చాయి. ఇప్పుడు కథ కూడా మెల్లమెల్లగా లీక్ అవుతూ వస్తోంది. దీంతో తన టీమ్ పై మండిపడ్డాడు దర్శకుడు మురుగదాస్. 

స్టార్ హీరో విజయ్ హీరోగా రూపొందుతోన్న సినిమా సర్కార్. విజయ్, మురుగదాస్ కాంబోలో వస్తోన్న థర్డ్ మూవీ ఇది. దీంతో హ్యాట్రిక్ కొడతారని అంతా అనుకుంటున్నారు. ఓ సోషల్ కాజ్ తో వస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఈ మధ్య కథతో పాటు కొన్ని సీన్స్ కూడా బయటికి లీక్ అవుతున్నాయట. అందుకు కారణం కొందరు జూనియర్ ఆర్టిస్ట్స్ బయట ఇస్తోన్న ఇంటర్వ్యూస్ అని మురుగదాస్ కు తెలిసింది. దీంతో తన టీమ్ ను ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో గట్టిగా హెచ్చరించాడు మురుగదాస్. ‘‘డియర్ సర్కార్ టీమ్ అండ్ క్రూ.. మనమంతా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా రూపొందించాం. కానీ అవన్నీ మర్చిపోయి కొందరు జూనియర్ ఆర్టిస్టులు నాకు తెలియకుండా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. కానీ ఇది అనైతికం. ఇకపై నాకు తెలియకుండా సినిమాకు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చినా.. లీగల్ యాక్షన్ తీసుకుంటా’’ అంటూ గట్టిగానే హెచ్చరించాడు. మరి దీనికి ఆ మూవీ టీమ్ ఎలాంటి స్పందన ఇస్తుందో చూడాలి. 

More Related Stories