English   

వీరభోగ వసంత రాయలు వచ్చేస్తున్నారహో...

Veera-Bhoga-Vasantha-Rayalu
2018-10-05 19:19:36

ఈ మధ్య కల్ట్ మూవీస్ అంటూ తెలుగు తెరపై అందమైన కథలు చూస్తున్నాం.. రియాలిటీకి దగ్గరగా.. ఒరిజినల్ లొకాలిటీస్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ అద్భుతమైన చిత్రాలతో వస్తున్నారు కొత్త దర్శకులు. అయితే ఇలాంటి కొత్త దర్శకులు రాకముందు నుంచే కొత్త దనం ఉన్న సినిమాలకే నా ఓటు అంటూ వస్తోన్న స్టార్ నారా రోహిత్. వైవిధ్యమైన సినిమాలతో బాణంలా దూసుకువచ్చిన రోహిత్.. కు తోడుగా కలిశాడు మరో స్టార్ శ్రీ విష్ణు. ఈ ఇద్దరూ కలిసి జర్నీ చేస్తున్నారు. ఆ మధ్య వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడుతో విమర్శకుల్ని సైతం ఆశ్చర్యపరిచిన ఈ ద్వయం ఇప్పుడు మరో హీరో సుధీర్ బాబును కూడా కలుపుకుని ‘వీరభోగ వసంత రాయలు’ అనే సినిమాతో వస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ లోనూ ఒక రకమైన పాజిటివ్ బజ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ శ్రీయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ టీమ్ అందరి ఫస్ట్ లుక్స్ తో పాటు స్మాల్ టీజర్స్ అన్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంద్రసేన డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. బాబా క్రియేషన్ బ్యానర్ పై అప్పారావు బల్లెన నిర్మిస్తోన్న చిత్రం ఇది. 

వీరభోగ వసంత రాయులు అనే టైటిల్ కే చాలామంది పడిపోయారు. ఇక టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్నాం అంటూ ముందు నుంచీ ఈ టీమ్ చెబుతూనే ఉంది. అయితే సినిమాలో మిగతా స్టార్స్ ఎవరున్నా.. ప్రధాన పాత్ర మాత్రం శ్రీ విష్ణుదే అంటున్నారు. మొత్తంగా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ఇది ఏ కైండ్ ఆఫ్ మూవీ అనే క్లూ కూడా ఇవ్వకుండా ఇంట్రెస్ట్ పెంచింది టీమ్. ఇక  పండగలను క్యాష్ చేసుకోవాలనే హడావిడీ లేకుండా.. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 26న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం అంటూ పోస్టర్ తో పాటు అనౌన్స్ చేసింది. మొత్తంగా నారా రోహిత్, శ్రీ విష్ణుతో తో పాటు సుధీర్ బాబు, శ్రీయలకు ఇది మెమరబుల్ మూవీ అవుతుందనేది వాళ్లంతా బలంగా చెబుతున్న మాట. మరి అది నిజమవుతుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories