English   

నాని కెరీర్ కు డేంజర్ బెల్స్ 

Nani-Deva-Das
2018-10-05 13:03:10

నాని.. నేచురల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. కానీ ఆ వెలుగులో తను చేస్తోన్న సినిమాలపై ఎక్కువగా కాన్ సెంట్రేట్ చేయలేకపోయాడు. దీంతో వరుసగా ఒకే తరహా సినిమాలు చేస్తూ వచ్చాడు. పేరుకు డబుల్ హ్యాట్రిక్ అని చెప్పుకున్నా.. నిజంగా ఇందులో మంచి కథ, కథనాలతో వచ్చిన సినిమాలు మూడో నాలుగో. ఇక ఎమ్.సి.ఏతోనే విమర్శలు ఫేస్ చేసిన నాని తర్వాత చేసిన కృష్ణార్జున యుద్ధంతో షాకే తిన్నాడు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు కొత్తగా వస్తోన్న యంగ్ స్టర్స్ మాత్రమే కాదు.. ఆల్రెడీ ఉన్న స్టార్స్ కూడా వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతోన్న టైమ్ లో నాని మాత్రం తనకు కంఫర్ట్ జోన్ అంటూ తెచ్చిన ప్రతి కథనూ ఒప్పుకుని ఒక దశలో తన ఫ్యాన్స్ కు కూడా చిరాకు తెప్పించాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన దేవదాస్ సైతం ఏమంత ఆకట్టుకోలేదు. అతని నటన బావున్నా.. సినిమాలో పెద్దగా మేటర్ లేకపోవడంతో ఈ మూవీ కూడా నానికి నిరాశ మిగిల్చింది. అంటే ఖచ్చితంగా అతను మరో బ్లాక్ బస్టర్ కొడితే కానీ ఈ మైనస్ లన్నీ మాసిపోవు. లేదంటే కెరీరే ప్రమాదంలో పడుతుంది. 

నిజానికి నాని హీరోగా మారిన తర్వాత తను ఈ రేంజ్ కు వస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ వచ్చాడు. బట్.. ఒక దశలోనే ఆగిపోయాడు తప్ప. రేంజ్ మార్చుకునే ప్రయత్నం ఏదీ చేయలేదు. ఒకే తరహా సినిమాలతో రేంజ్ మారేలా ఏ ప్రయత్నమూ చేయలేదనే చెప్పాలి. అందుకే విజయ్ దేవరకొండ వంటి వెనక వచ్చిన స్టార్ ముందుకు వెళితే నాని మాత్రం అక్కడే ఆగిపోయాడు. దానికి తోడు ఇప్పుడు వరుస వైఫల్యాలు అతన్ని మరింత ఇబ్బంది పెడతున్నాయి. దేవదాస్ కూడా పోవడంతో నాని కూడా ఆలోచనలో పడ్డాడు.. మరోవైపు బిగ్ బాస్ -2 కు చేసిన హోస్టింగ్ తో పేలవమైన యాంకరింగ్ చేసి అక్కడా మాగ్జిమం విఫలమయ్యాడు. ఇది అతని క్రేజ్ రేంజ్ ను తెలియజేస్తుంది.. మొత్తంగా నాని కెరీర్ నిజంగానే ఇప్పుడు కాస్త డేంజర్ జోన్ లో ఉంది. 

ఒక రకంగా చెబితే నాని స్టార్ మెటీరియల్ కాదని అనే వాళ్లూ ఉన్నారు. పైగా ఎక్కువ కాలం స్టార్ హీరోగా కంటిన్యూ అయ్యే అవకాశాలూ తక్కువే అన్నవాళ్లూ లేకపోలేదు. మొత్తంగా అన్నీ దాటుకుని వచ్చినవాడు కేవలం స్వయంకృతాపరాధంతోనే ఇలాంటి యావరేజ్ సినిమాలు చేస్తూ యావరేజ్ హీరోగా నిలిచాడు. ప్రస్తుతం నాని ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ 1990స్ టైమ్ లో సాగే సినిమా అంటున్నారు. అర్జున్ అనే కొత్త దర్శకుడు చేస్తోన్న సినిమా ఇది. మరి ఇది కూడా అటూ ఇటైతే.. ఇక నాని మల్టీస్టారర్స్ నుంచి క్యారెక్టర్స్ కు మారక తప్పని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. మరి ఇలాంటి సిట్యుయేషన్ లో నాని కొత్తగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.

More Related Stories