English   

సొంతూరికి చెక్కేస్తానంటోన్న హీరో రామ్

Ram-Pothineni
2018-10-05 20:26:02

రామ్ హీరోగా నటించిన సినిమా ‘హలోగురూ ప్రేమకోసమే’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు.  రామ్ అండ్ అనుపమకు ఈ సినిమా చాలా కీలకం. దసరా సందర్భంగా ఈ నెల 18న విడుదల కాబోతోన్న ఈచిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. నేటివ్ ప్లేస్ అంటూ సాగే ఈ పాట సొంత ఊరి గొప్పదనం గురించి మాట్లాడుకునే సందర్భంలో వచ్చే పాటగా కనిపిస్తోంది. శ్రీ మణి అందించిన సాహిత్యం మరోసారి మనల్ని సొంతూరు జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లేలా ఉంది. బట్ ట్యూనే పెద్దగా ఆకట్టుకునేలా లేదనే విమర్శలు వచ్చాయి. దేవీ శ్రీ ప్రసాద్ ట్యూన్ కాపీ అంటూ యూ ట్యూబ్ లోనే కమెంట్స్ వస్తున్నాయి.

దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయొస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా దుమ్మురేపుతోన్న దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తే సినిమా సగం హిట్టే అనే టాకూ ఉంది. బట్.. ఈ మద్య దేవీ కూడా కాపీ ట్యూన్స్ కొట్టేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. లేటెస్ట్ గా రామ్ హీరోగా నటించిన ‘హలోగురూ ప్రేమకోసమే’ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన పాటపై తెగ విమర్శలు వస్తున్నాయి. 

నేటివ్ ప్లేస్ అంటూ సాగే ఈ పాటపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. నేను లోకల్ నుంచి డిస్ట్రబ్ డిస్ట్రబ్ తో పాటు నేను శైలజలోని మస్తీ మస్తీ అనే పాటను మిక్స్ చేసి ఈ ట్యూన్ క్రియేట్ చేసినట్టుగా సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్. ఇవి కూడా ఆయన ట్యూన్సే కాబట్టి కాపీ అనలేం. బట్.. కొత్తదనం మాత్రం లేదనే కదా అర్థం. ఏదేమైనా దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఇలాంటి ట్యూన్స్ ఇవ్వడం మొదలుపెడితే.. ఇక టాలీవుడ్ మళ్లీ కొత్త సంగీత దర్శకుల వైపు సీరియస్ గా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. 

More Related Stories