English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ అల‌వాటు చేసుకుంటాడా?

Vijay Devarakonda Will Accept Another bilingual After NOTA?
2018-10-06 07:26:29

ఎందుకో తెలియ‌దు కానీ చాలా మందితో విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌గానే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ వ‌స్తుంది. ఈయ‌న‌కు ఉన్న ఇమేజ్ అలాంటిది మ‌రి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం విజ‌య్ తెలుగు హీరో మాత్ర‌మే కాదు.. త‌మిళ్ హీరో కూడా. ఈయ‌న న‌టించిన నోటా సినిమాకు మ‌న ద‌గ్గ‌ర టాక్ తేడాగా వ‌చ్చినా త‌మిళ‌నాట మాత్రం ప‌ర్లేదు అంటున్నారు. అక్క‌డి రాజ‌కీయాలు కావ‌డంతో ప్రేక్ష‌కులు బాగానే క‌నెక్ట్ అవుతున్నారు. చాలా చోట్ల ఈ సినిమా హౌజ్ పుల్స్ క‌నిపిస్తున్నాయి. మూడు రోజుల వ‌ర‌కు టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడైపోయాయి. అంతేకాదు ఈ సినిమాలో విజ‌య్ న‌ట‌న‌కు ఫిదా అయిపోతున్నారు త‌మిళ తంబిలు. దాంతో ఇప్పుడు త‌మిళ్ ఇండ‌స్ట్రీ నుంచి విజ‌య్ కు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని తెలుస్తుంది.

ఎస్ఆర్ ప్ర‌భు నిర్మించ‌బోయే ఈ చిత్రంలో విజ‌య్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాను ఓ లేడీ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌బోతుంద‌నే వార్త‌లిప్పుడు త‌మిళ‌నాట బాగానే వినిపిస్తున్నాయి. త‌మిళ తంబిలు విజయ్ దేవరకొండను అలవాటు చేసుకొంటారో లేదో కానీ.. విజయ్ మాత్రం నోటా విడుద‌ల‌కు ముందు.. ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత కూడా త‌మిళ‌నాడులోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు. నోటా రిలీజ్ డే కూడా చెన్నైలోనే ఉన్నాడు  విజ‌య్. అక్క‌డే థియేట‌ర్స్ అన్నీ తిరుగుతూ అక్క‌డి వాళ్ల‌ను అల‌వాటు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు లేడీ డైరెక్ట‌ర్ క‌థ‌కు ఫిదా అయిపోయాడు. ఖచ్చితంగా చేయాల‌నే ఫిక్సైపోతున్నాడు విజ‌య్. ఈయ‌న కంటే ముందు నాని, శ‌ర్వానంద్ లాంటి హీరోలు బై లింగువ‌ల్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. మ‌రి ఇప్పుడు విజ‌య్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి..!

More Related Stories