English   

ట్యాక్సీవాలా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Vijay-Devarakonda
2018-10-06 12:01:53

అన్ని సినిమాలు వ‌స్తున్నాయి.. వెళ్తున్నాయి.. ఆ ఒక్క‌టి త‌ప్ప‌. పోనీ ఊరు పేరు తెలియ‌ని వాళ్లున్నారా అంటే అదీ కాదు. అందులో 100 కోట్ల హీరో ఉన్నాడు. అయినా కూడా బ‌య‌టికి రాకుండా మూడు నెల‌లుగా బాక్సుల్లోనే ఉండిపోయింది. అదే ట్యాక్సీవాలా. ఈ సినిమా కూడా ఇప్పుడు లీక్ అయిపోయింది. ఒక‌టి రెండు కాదు.. మూడు గంట‌ల‌కు పైగా ఫీడ్ బ‌య‌టికి వ‌చ్చింద‌ని తెలుస్తుంది. అయితే గీత‌గోవిందం ఇచ్చిన న‌మ్మ‌కంతో విజ‌య్ ఈ సినిమా కూడా హిట్ అవుతుంద‌నే న‌మ్ముతున్నాడు. ప్ర‌స్తుతం ఈ బండి షెడ్ లో ఉంది. కానీ ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రీత్య‌న్ మాత్రం త‌న సినిమా పూర్తైంద‌ని.. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంద‌ని చెబుతున్నాడు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈ చిత్రం న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. దీనికోసం ఇప్ప‌ట్నుంచే స‌న్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత‌లు. విజ‌య్ కు పెరిగిన ఇమేజ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా క‌థ‌ను కాస్త మార్చేస్తున్నారు. 

ఈ చిత్రం కూడా గీతాఆర్ట్స్ లోనే కావ‌డంతో కాస్త ఆల‌స్య‌మైనా ప‌ర్లేదంటున్నాడు అల్లు అర‌వింద్. ఆయ‌న‌తో పాటు యువీ క్రియేష‌న్స్ కూడా ట్యాక్సీవాలా నిర్మాత‌ల లిస్ట్ లో ఉన్నారు. ఇలాంటి టైమ్ లో కానీ విజ‌య్ కు ఫ్లాప్ వ‌స్తే చేసిన క‌ష్టం అంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైపోతుంది. అందుకే లేటైనా లేటెస్ట్ గా రావాల‌ని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు విడుద‌లైన నోటాకు కాస్త బ్యాడ్ టాక్ వ‌చ్చింది.. అందుకే క‌చ్చితంగా మ‌ళ్లీ విజ‌య్ వ‌చ్చి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. అందుకే ట్యాక్సీవాలా కాస్త ఆల‌స్యంగా అయినా కూడా నెమ్మ‌దిగానే రానుంది. అయితే న‌వంబ‌ర్ 8న అనుకుంటున్నారు బాగానే ఉంది కానీ దానికి రెండు రోజుల ముందే విజ‌య్ న‌టించిన స‌ర్కార్ విడుద‌ల కానుంది. మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో తెలుగులోనూ ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పైగా గ‌తేడాది అదిరిందితో తెలుగులో ఖాతా ఓపెన్ చేసాడు విజ‌య్. మ‌రి ఆ విజ‌య్ తో ఈ విజ‌య్ పోరు ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!       

More Related Stories