English   

అంతఃపురం+దమ్ము= అర‌వింద స‌మేత‌.. 

Aravinda-Sametha
2018-10-06 15:21:58

నిజంగానే ఇప్పుడు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ గురించి ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్రమ్ పూర్తిస్థాయి సీమ నేప‌థ్యంలో తొలిసారి తెర‌కెక్కిన సినిమా ఇది. ఇక ఈ సినిమా క‌థ చూస్తుంటే కొన్ని పాత సినిమాలు గుర్తుకొస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా అంతఃపురం.. ద‌మ్ము ఛాయ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయ‌ని తెలుస్తుంది. అంతఃపురంలో కూడా రాయ‌ల‌సీమ ప‌గ‌లే కీల‌కం. ఇందులో కూడా ప‌గ‌లు ఆపే పాత్ర‌లో సాయికుమార్ న‌టించాడు.. సీమ నేత‌గా ప్ర‌కాశ్ రాజ్ కర్క‌శంగా క‌నిపించాడు.
 
ఇక ద‌మ్ములో హీరో పాత్ర కూడా ఎలాగైనా ప‌గ‌లు ఆపాల‌ని చూస్తుంటాడు. ఈ రెండు సినిమాల్లో యాక్ష‌న్ పార్ట్ తో పాటు సందేశం కూడా ఉంటుంది. ఇదే క‌థ‌ను ఇప్పుడు త్రివిక్ర‌మ్ త‌న స్టైల్ లో చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది ఈ చిత్రం. బిజినెస్ కూడా 93 కోట్ల‌కు పైగానే జ‌ర‌గ‌డంతో ఏం జ‌ర‌గ‌బోతుంద‌నే ఆస‌క్తి కూడా క‌నిపిస్తుంది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే అంతఃపురం కానీ.. ద‌మ్ము కానీ రెండూ బ్లాక్ బ‌స్ట‌ర్ కావు.. మ‌రి అలాంటి సినిమాల నుంచి త్రివిక్ర‌మ్ ఎలాంటి స్పూర్థి తీసుకున్నాడో చూడాలిక‌.

More Related Stories