English   

వామ్మో ఆ ఎమోషన్ ఏందీ సామీ...?

Peniviti-Song
2018-10-06 18:19:25

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫైనెస్ట్ యాక్టర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే తన యాక్టింగ్ స్కిల్స్ తో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన ప్రతిభ చూపించాడు. ఇక ఎమోషన్ సీన్స్ లో ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని వారుండరు. అది తెలిసే అతనితో ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఓ ఎమోషనల్ కంటెంట్ తోనే సినిమా చేస్తున్నట్టుగా ఉన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న అరవింద సమేత వీరరాఘవ సినిమా నుంచి లేటెస్ట్ గా ఓ వీడియో ప్రోమో సాంగ్ విడుదల చేశారు. అనూహ్యంగా ఈ పాటను ఎన్టీఆర్ పాడుతున్నాడు.

కేవలం 30సెకన్లు మాత్రమే ఉన్న వీడియోలో అతను చూపిన ఎమోషన్ పీక్స్ లో ఉందని చెప్పాలి. కళ్లలో నుంచి నీళ్లు ధారాపాతంగా కారుతుండగా తనే పాడుతూ కనిపిస్తున్నాడు యంగ్ టైగర్.. అతని వెనక హీరోయిన్ ఈషా రెబ్బా కూడా కనిపిస్తోంది. అలాగే ఎన్టీఆర్ చివర్లో గిటార్ పట్టుకుని మరీ పాడటం చూస్తుంటే సినిమాలో ఈ టచ్ కూడా ఉంటుందేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఈ పాట కోసం సినిమాటోగ్రఫర్ వినోద్ చేసిన కలరింగ్ కూడా అదిరిపోయింది. అంటే పాట మూడ్ కు తగ్గట్టుగా అద్భుతమైన లైటింగ్ కనిపిస్తోంది.  ఇక ఈ నెల 11న విడుదల కాబోతోన్న ఈ మూవీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కెరీర్ లోనే బెస్ట్ థియేట్రికల్ రైట్స్ కు అమ్ముడుపోయింది. ఈజీగా వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమాగా ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇక సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన కొత్త రికార్డులు సెట్ కావడం ఖాయం.

More Related Stories