English   

టాప్ మిలియనీర్ గా మహేష్ బాబు 

Mahesh-Babu
2018-10-06 20:19:12

మహేష్ బాబు ఆల్రెడీ మిలియనీర్ కదా.. మళ్లీ బిగ్గెస్ట్ అంటే.. చాలా ఎక్కువ సంపాదించాడా అనుకుంటున్నారేమో.. సంపాదించాడు.. కానీ డబ్బులు కాదు.. అభిమానుల్ని. యస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు ట్విట్టర్ లో టాలీవుడ్ లో హయ్యొస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ గా ఎదిగాడు. మొదట్నుంచీ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ కు తగ్గట్టుగానే అతను కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ మధ్య మరీ తనకు నచ్చిన సినిమాలపై రివ్యూస్ కూడా పెడుతున్నాడు. అంతేనా.. బిగ్ బాస్-2 విన్నర్ కౌశల్ లాంటి చిన్న చిన్న అంశాలపై కూడా స్పందిస్తున్నాడు. ఈ కారణంగానే ఆయనకు మరింత మంది సోషల్ మీడియా అభిమానులు పెరుగుతున్నారు.

లేటెస్ట్ గా ట్విట్టర్ లో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 7మిలియన్ కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేస్తూ తన ‘ట్వీపుల్’కు థ్యాంక్స్ చెప్పాడు. సౌత్ ఇండియలో హయ్యొస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో మహేష్ బాబుది సెకండ్ ప్లేస్.. అంటే తెలుగులో నెంబర్ వన్ అన్నమాట. మొత్తంగా సూపర్ స్టార్ ట్విట్టర్ లో సాత్ మిలియనీర్ అయ్యాడు.  ప్రస్తుతం సూపర్ స్టార్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ 2019 ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఆ దిశగానే జాయ్ గా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్న యూనిట్.. ఈ నెల 18నుంచి  మరో షెడ్యూల్ కోసం యూఎస్ షూటింగ్ కు వెళ్లబోతోంది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో సినిమా ఉంటుంది. 

More Related Stories