English   

రామ్ చరణ్ ది ఎంత పెద్ద మనసో...

Ram-Charan
2018-10-06 21:07:18

డబ్బులు ఊరికే రావు.. కానీ మంచి మనసు మాత్రం ఊరికే వస్తుంది. కాకపోతే అది చాటుకోవాల్సిన సందర్భంలో పెద్ద మనసు చూపించగలిగితే చాలు.. యస్.. మెగాస్టార్ తనయుడుగా వచ్చిన రామ్ చరణ్ నటుడుగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే మంచి మనసు విషయంలోనూ తండ్రికి తగ్గ తనయుడుగానే నిలుస్తున్నాడు చరణ్. పైగా ఓ నిర్మాతగా ఉండి కూడా లేటెస్ట్ గా చరణ్ చేసిన సాయానికి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏ నిర్మాతైనా తమ సినిమా కోసం పనిచేసిన వారిని వారి స్థాయికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ ఇస్తాడు. కానీ రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కు అదనంగా వాళ్లకు బోనస్ లు కూడా ఇచ్చాడు. అది కూడా డాలర్స్ రూపంలో.. ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం.. మరి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తోన్న సైరా నరసింహారెడ్డి ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటోంది. మాగ్జిమం యూనిట్ అక్కడే చాలా రోజులుగా ఉంది. అయితే యూనిట్ లో చాలామంది మామూలు వాళ్లు(ఫైనాన్సియల్ గా) ఉన్నారు. దీంతో వారికి అక్కడ ఏదైనా కొనుక్కోవాలన్నా ఇబ్బందే. పైగా అక్కడ డాలర్స్ లో ఉంటుంది వ్యవహారం. దీంతో రామ్ చరణ్ వీళ్లలో చాలామంది అసిస్టెంట్స్ కు కొంత మొత్తం బోనస్ ఇస్తూ.. ఎవరికి కావాల్సింది వాళ్లు కొనుక్కిండి అని చెప్పాడుట. అది డాలర్స్ లో ఇచ్చి.. ఇది జస్ట్ పాకెట్ మనీ అనుకోండి అని సింపుల్ గా చెప్పాడట. దీంతో తమ నిర్మాత పెద్ద మనసు చూసి వాళ్లంతా చలించిపోయారట. అందుకే అనేది.. పెద్ద మొత్తంలో డబ్బు ఎందరికో ఉండొచ్చు. కానీ మనసు మాత్రం కొందరికే ఉంటుంది.. 

More Related Stories