English   

రామ్ లో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతోంది.. ?

Hello-Guru-Prema-Kosame
2018-10-06 21:20:26

ఓ సినిమా హిట్ కళ విడుదలకు ముందే చేసిన వారికి తెలుస్తుంది. నిజం.. కొన్ని సినిమాలపై బ్లైండ్ నమ్మకం పెట్టుకున్నా.. అవి వర్కవుట్ కావు. కాకపోతే ఇవేవీ ప్రమోషన్స్ లో పైకి కనిపించకుండా మేనేజ్ చేస్తారు కానీ.. ఓవరాల్ గా చేసిన వాళ్లకు, తీసిన వాళ్లకు తమ సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోతుంది. అలా ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా తన కొత్త సినిమా ‘హలో గురూ ప్రేమకోసమే’ విషయాలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. మరి అది అతనికి ఈ సినిమాపై ఉన్న నమ్మకమే అని వేరే చెప్పక్కర్లేదేమో.. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఉన్నది ఒకటే జిందగీ తర్వాత మరోసారి రామ్ తో జతకట్టింది అనుపమా పరమేశ్వరన్. 

ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న హలోగురూ ప్రేమకోసమే చిత్రాన్ని ఈ నెల 18న దసరా సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏదీ లేదు. కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలున్నాయ్. ఎన్టీఆర్ అరవింద సమేత దసరా బరిలో ఉన్నా.. పండగనాటికి ఆ సినిమా విడుదలై వారం అవుతుంది. అంటు విశాల్ పందెంకోడి-2 కూడా వస్తోన్నా డబ్బింగ్ సినిమా కాబట్టి రామ్ కు వచ్చిన ఇబ్బందేం లేదు. అటు సినిమా కూడా బాగా వచ్చిందనే టాక్ ఉంది. ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయ్ కాబట్టే రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఈ నెల 8న సోమవారం రోజున మూవీ ఆడియో విడుదల చేయబోతున్నారు. మరి ఆ రోజు థియేట్రికల్ ట్రైలర్ కూడా ఇచ్చేస్తే సినిమా ఎలా ఉండబోతోందో ఓ అంచనాకు రావొచ్చు.ఇక ఈ ఆడియో డేట్ అనౌన్స్ చేస్తూ రామ్ తో ఓ టీజర్ విడుదల చేశారు. మనోడు క్యూట్ గా డ్యాన్స్ చేస్తూ హుషారుగా ఉన్నాడీ ప్రోమోలో.

More Related Stories