English   

అర‌వింద స‌మేత‌ సెన్సార్ కు సిద్ధమేనా?

NTR’s Aravinda Sametha Movie Censor Copy Ready
2018-10-07 07:41:14

అన్నీ అయిపోయాయి.. ఇక ఇప్పుడు అర‌వింద స‌మేత‌తో అన్ని బంధాలు తెంచేసుకున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఇక ఇప్పుడు ఈయ‌న‌కు ఏ సంబంధం లేదు.. సింపుల్ గా సెన్సార్ పూర్తి చేసి థియేట‌ర్స్ కు పంపించ‌డ‌మే త‌రువాయి. విడుద‌ల‌కు ఐదు రోజుల ముందే ఫ‌స్ట్ కాపీ సిద్ధం చేసి ఉంచాడు త్రివిక్ర‌మ్. మరో రెండు రోజుల్లో సెన్సార్ కాపీ కూడా సిద్ధం కానుంది. అక్టోబ‌ర్ 8న ఈ చిత్రం సెన్సార్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అక్టోబ‌ర్ 9న పూర్తిగా ప్ర‌మోట్ చేసుకుని.. 10 రాత్రి నుంచే భారీ ప్రీమియ‌ర్స్ సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టికే గుంటూర్ లాంటి ఏరియాల్లో బెనిఫిట్ షోస్ కూడా సిద్ధం అయిపోయాయి.

అక్క‌డ ప‌ర్మిష‌న్స్ అన్నీ తీసుకుని థియేట‌ర్స్ ను ముస్తాబు చేసి.. టికెట్స్ కూడా ముద్రించేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకోడానికి రెడీగా ఉన్నారు. ఇక వీర‌రాఘ‌వ‌రెడ్డి రావ‌డం.. బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేయ‌డం మాత్ర‌మే మిగిలాయి. త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల త‌ర‌హాలో కామెడీగా కాకుండా ఇందులో గుండెల‌ను హ‌త్తుకునే కంటెంట్ చెబుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ లోనూ ఇదే చూపించాడు మాట‌ల మాంత్రికుడు. సీమ‌లో ఉన్న య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌కు ఈ సినిమాతో అద్దం ప‌డుతున్నాడు త్రివిక్ర‌మ్. మొత్తానికి రేపు సెన్సార్ అయిన త‌ర్వాత అస‌లు టాక్ కూడా బ‌య‌టికి రానుంది. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించింది.

More Related Stories