English   

ఇలియానా మోస్ట్ డేంజ‌రెస్ వైర‌స్

ileana d'cruz Most Dangerous Virus in India
2018-10-07 11:46:19

ఛీఛీ.. అదేంటి ఇలియానాను ట‌చ్ చేస్తే వైర‌స్ తో పోవ‌డం ఏంటి పిచ్చేమైనా ప‌ట్టిందా అనుకుంటున్నారా..? అవును పిచ్చే ప‌ట్టింది.. కాక‌పోతే ఇది మీకు కాదు.. మీ సిస్ట‌మ్స్ కు.. ఫోన్లకు ప‌డుతున్న పిచ్చి. ఇప్పుడు మ‌నం ఉన్న‌ది డిజిట‌ల్ యుగంలో అనే సంగ‌తి అస్స‌లు మ‌రిచిపోకూడ‌దు. మ‌న బ‌తుకులు తెలియ‌ని మూడో వాడి చేతుల్లో ఉంటాయ‌నే విష‌యాన్ని కూడా గుర్తించుకోవాలి. ప్ర‌తీ చిన్న విష‌యం కూడా ఇప్పుడు హ్యాక‌ర్లు ఈజీగా క‌నిపెట్టేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇండియాలో మోస్ట్ స‌ర్చ్డ్ హీరోయిన్ ఎవ‌రు అని తెలుసుకుని.. ఇలియానా అని క‌నుక్కుని.. ఈమె కోసం స‌ర్చ్ చేస్తున్న లింకుల్లోనే వైర‌స్ ను పంపిస్తున్నారు.

ఒక్క‌సారి ఇలియానాకు సంబంధించిన వీడియోస్ కానీ.. హాట్ ఫోటోస్ కానీ చూసారంటే మీకు తెలియ‌కుండానే వైర‌స్ మీ ఫోన్స్.. సిస్ట‌మ్స్ కు వ‌చ్చేస్తుంది. డేటా ఆటోమేటిక్ గా హ్యాక‌ర్ల చేతికి వెళ్లిపోతుంది. ఇల్లీబేబీకి ఉన్న క్రేజ్ యూజ్ చేసుకోడానికి హ్యాక‌ర్లు వేసిన మాస్ట‌ర్ ప్లాన్ ఇది. అందుకే ఇండియాస్ మోస్ట్ డేంజ‌రెస్ హీరోయిన్ గా ఇలియానా ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. ఈ విష‌యాన్ని చెప్పింది కూడా అమెరికన్ ప్రఖ్యాత సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్ మెంట్. అందుకే ఇలియానాతో కాస్త జాగ్ర‌త్త‌. అన్న‌ట్లు ఆరేళ్ల త‌ర్వాత ఈమె అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది.

More Related Stories