English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు టాక్ తో సంబంధం లేదు

NOTA Movie First day Collections Credit by Vijay Devarakonda
2018-10-07 12:37:47

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు తొలిరోజు టాక్ తో ప‌నిలేదు.. ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్నా కూడా ఫ‌స్ట్ డే కుమ్మేస్తుంది.. ఇక మ‌హేష్ బాబుకు కూడా టాక్ అవ‌స‌రం లేదు.. వీళ్ల సినిమా ఎలా ఉన్నా కూడా రెండు మూడు రోజులు హౌజ్ ఫుల్స్ ఆడేస్తుంటాయి. సినిమా బాగోలేక‌పోయినా వాళ్ల‌ను చూడ్డానికి థియేట‌ర్ కు వ‌స్తుంటారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు ఇదే స్థాయిలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూస్తున్నారు ఆడియ‌న్స్. లేక‌పోతే మ‌రేంటి.. నోటా విడుద‌లై తొలిరోజు బిలో యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ చిత్రానికి తొలిరోజు ఏకంగా 7.50 కోట్ల షేర్ వ‌చ్చింది. తొలి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నాని, నాగార్జున దేవ‌దాస్ కూడా తొలిరోజు కేవ‌లం 6.57 కోట్ల షేర్ తో స‌రిపెట్టుకుంది. అంటే విజ‌య్ వాళ్లిద్ద‌ర్నీ కూడా త‌న ఇమేజ్ తో డామినేట్ చేసాడ‌న్న‌మాట‌. అంతేకాదు.. త‌మిళ్ ఫ్లేవ‌ర్ అంతగా క‌నిపిస్తున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్ అయింది ఈ చిత్రం.

స్లో గా ఉంది అంటూనే మూడు రోజులు కుమ్మేసేలా క‌నిపిస్తుంది నోటా. ఇప్పుడు తీరు చూస్తుంటే మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఈజీగా 13 కోట్ల షేర్ వ‌ర‌కు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. ఇదే కానీ జ‌రిగితే మ‌రో 12 కోట్లు బాకీ ఉంటుంది. అక్టోబ‌ర్ 11న అర‌వింద స‌మేత వ‌చ్చేంత వ‌ర‌కు కూడా మ‌రో సినిమా లేదు కాబ‌ట్టి వీక్ డేస్ లో కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న స్టామినాతో కాస్త లాగ‌గ‌లిగితే నోటా త‌క్కువ న‌ష్టాల‌తో బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది. మొత్తానికి సినిమాను కాదు.. త‌న‌ను చూసి సినిమాకు రండి అనే స్థాయికి మూడు నాలుగు సినిమాల‌తో వ‌చ్చేసాడు విజ‌య్. అందుకే ద‌ర్శ‌కులు కూడా ఇత‌ర న‌టీన‌టుల కంటే కూడా విజ‌య్ పైనే ఎక్కువ‌గా సీన్స్ రాసుకుంటున్నారు. గీత‌గోవిందంలో అయితే ప్రతీ సీన్ లో విజ‌య్ క‌నిపించాడు. ఇప్పుడు నోటాలో కూడా ఆనంద్ శంక‌ర్ దాదాపు ఇదే రిపీట్ చేసాడు.

More Related Stories