English   

పాపం మోహ్రీన్ కౌర్ కు ప్రాధాన్యత లేదా?

Unlucky Heroine mehreen pirzada Wants A Hit
2018-10-07 13:21:28

కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పంజాబీ సోయగం మెహ్రీన్ కౌర్ ను చూసి మనాళ్లు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికినట్టే అని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ మూవీలో పద్ధతిగా ఉన్నా తర్వాత రెచ్చిపోయింది. తన భారీ థైస్ తో రాజా ది గ్రేట్ అంటూ మరో హిట్ కొట్టింది. దీంతో ఇక తన రేంజ్ మారడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత అమ్మడు చేసిన సినిమాలన్నీ పోతున్నాయి. పోతే పోయాయ్.. ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే కదా అనుకునేవారూ ఉన్నారు. కానీ మెహ్రీన్ పరిస్థితి వేరే.. తను ఈ మధ్య నాలుగు ఫ్లాపులు చూసింది. వీటిలో రెండు సినిమాలు మరీ దారుణం. ఎందుకంటే ఆ సినిమాల్లో అమ్మడు ఎందుకుందో కూడా ఎవరికీ అర్థం కాదు. పైగా ఈ రెండూ తమిళ సినిమాలు.. తెలుగు హీరోలు చేసినవి. సందీప్ కిషన్ తో చేసిన కేరాఫ్ సూర్యలో తన పాత్రే చిన్నది.. ప్రాధాన్యం లేనది అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మరిన్ని సీన్స్ కూడా కట్ చేసి అవమానించారు. ఇక ఇప్పుడు నోటాతో మరీ దారుణంగా మారింది అమ్మడి పరిస్థితి.

అందుకే పాపం మెహ్రీన్ కౌర్.. అని ఎవరి నోటా విన్నా ఇదే మాట. యస్.. అమ్మడు చేసిన ‘నోటా’ సినిమా ఎఫెక్ట్ ఇదంతా. ఈ సినిమాలో తన పాత్రేంటో తనకైనా తెలుసా అని సెటైర్స్ పడుతున్నాయి. నిజానికి ఏ దర్శకుడు ఇలాంటి హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేయడు. నోటా దర్శకుడు చేశాడు. సరే కనీసం తనకైనా తెలియాలి కదా.. తన పాత్ర ఎలా ఉంటుందని. ఆ రెండు విషయాల్లో అంచనా వేయలేకపోయిన మెహ్రీన్ పై అంతా సానుభూతి చూపిస్తున్నారు. దీంతో తన కోలీవుడ్ ఎంట్రీ దారుణంగా ముగిసినట్టే అనుకోవాలి. ఇటు తెలుగులోనూ పెద్దగా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లేవిప్పుడు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రాజా ది గ్రేట్ తో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. అసలే మల్టీస్టారర్.. అటు వెంకీ సరసన తమన్నా ఉంది. మరి ఇంతటి టైట్ సిట్యుయేషన్ లో మెహ్రీన్ కు ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడుతుందో ఈజీగా ఊహించేయొచ్చు.

More Related Stories