English   

గీత‌గోవిందం బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది

Geetha Govindam Worldwide Box Office Final Collections
2018-10-08 08:21:06

హ‌మ్మ‌య్యా ఎట్ట‌కేల‌కు గీత‌గోవిందం క‌లెక్ష‌న్స్ కు తెర‌ప‌డింది. 50 రోజులు పూర్తి కావ‌డంతో ఈ చిత్ర ఫైన‌ల్ క‌లెక్ష‌న్ లెక్క తేలింది. గ‌బ్బ‌ర్ సింగ్ కు ఒక్క కోటి దూరంలోనే ప్ర‌యాణం ముగించేసాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయినా కూడా అర్జున్ రెడ్డితో తెలుగు ఇండ‌స్ట్రీ రూపురేఖ‌లు మార్చేసిన ఈ హీరో.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోనే టాప్ హిట్స్ లో ఒక‌టి సొంతం చేసుకున్నాడు. ఒక‌టా రెండా ఏకంగా 120 కోట్ల మార్క్ అందుకున్నాడు విజ‌య్. ఈయ‌న న‌టించిన గీత‌గోవిందం 68 కోట్ల ద‌గ్గ‌ర ర‌న్ ఆగిపోయింది. దూకుడు.. రేసుగుర్రంతో పాటు చాలా సినిమాలు క్రాస్ చేసింది ఈ సినిమా. గ‌బ్బ‌ర్ సింగ్ 69 కోట్లు మాత్ర‌మే మిగిలిపోయింది.

దానికి ఒక్క కోటి దూరంలో విజ‌య్ రేస్ నిలిపేసాడు. ఇప్ప‌టికే పెట్టుబ‌డికి మూడింతల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. 52 రోజుల్లో 67.80 కోట్ల‌ షేర్ వ‌సూలు చేసి.. 120 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకున్నాడు విజ‌య్ దేవ‌రకొండ‌. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 48 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. యుఎస్.. క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. కేర‌ళ‌.. ఇలా ఏ ప్లేస్ చూసినా గీత‌గోవిందం రికార్డులు సృష్టించింది. చాలా సినిమాలు గీత‌గోవిందం దూకుడు ముందు త‌ట్టుకోలేక చేతులెత్తేసాయి. నెల రోజుల త‌ర్వాత కూడా ఈ సినిమాకు హౌజ్ ఫుల్స్ ప‌డ్డాయంటే సీన్ అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి కెరీర్ లో పెద్ద హిట్ కొట్టి ఇప్పుడు మ‌రో మెట్టెక్కేసాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

More Related Stories