English   

చరణ్ బోయపాటి సినిమా టైటిల్ ఇదేనా?

Director Boyapati Looking Soft Title For Ram Charan Movie
2018-10-08 08:59:48

జ‌య జాన‌కీ నాయ‌కా తర్వాత బోయపాటి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదివ‌ర‌కు త‌న సినిమాల‌కు ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ పెట్టే బోయ‌పాటి.. ఇప్పుడు మాత్రం సింపుల్ గా సాఫ్ట్ టైటిల్స్ తో వ‌స్తున్నాడు. ఇప్పుడు బోయ‌పాటితో పాటు చిత్ర‌యూనిట్ అంతా దాని కోస‌మే వేట సాగిస్తున్నారు. వాళ్లు వెతుకుతున్న‌ది టైటిల్ కోసం. బోయ‌పాటి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు విన‌య విధేయ రామ అనే సంస్కార‌వంత‌మైన టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

రంగ‌స్థ‌లం కిక్ లోంచి బ‌య‌టికి వ‌చ్చి బోయ‌పాటితో సినిమాను వేగంగానే పూర్తి చేస్తున్నాడు మెగా వార‌సుడు. ఇప్ప‌టికే ఈ చిత్రం నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మొన్న‌టి అజార్ బైజాన్ షెడ్యూల్లో చ‌ర‌ణ్ తో పాటు ప్రశాంత్.. స్నేహ.. కియారాతో పాటు మిగిలిన కీల‌క‌మైన న‌టులు కూడా పాల్గొన్నారు.  ఫ్యామిలీ యాక్ష‌న్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నాడు బోయ‌పాటి. గ్యాంగ్ లీడ‌ర్ త‌ర‌హాలో ఈ చిత్రం ఉండ బోతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న బోయ‌పాటి-రామ్ చ‌ర‌ణ్ సినిమా విడుద‌ల కానుంది. మ‌రి ఈ టైటిల్ తో బోయ‌పాటి ఎలాంటి ర‌చ్చ చేయ‌బోతున్నాడో చూడాలి..!

More Related Stories