అరవింద సమేతకు చంద్రబాబు సాయం

అసలే ఇప్పుడు ఎన్నికల సమయం.. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ తో చాలా అవసరం కూడా ఉంటుంది. అందుకే ఇప్పట్నుంచే బుడ్డోన్ని మచ్చిక చేసుకునే పనిలో చంద్రబాబు ఉన్నాడేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు పెద్దగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వట్లేదు ఏపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు అరవింద సమతేకు అది దొరికింది. స్టార్ హీరో సినిమా విడుదల అవుతుందంటే ఖచ్చితంగా అభిమానులతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఆ సందడి కనిపిస్తుంటుంది. అందులోనూ వరసగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ సినిమా అంటే ఇంక ఆ రచ్చ ఎలా ఉంటుందో చెప్పనక్క ర్లేదేమో..? ఇప్పుడు అరవింద సమేతకు ముందు సందడి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కర్ణాటకలో కూడా స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చేసింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో ఉదయం 4.50 నిమిషాల నుంచే షోలు మొదలు కానున్నాయి. పైగా టికెట్ రేట్లు కూడా 200 గా నిర్ణయించారు. ఇంక రోజుకు 5 నుంచి 6 షోలు వేసుకోవచ్చని కూడా చెప్పారు. మొత్తానికి సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల రికార్డులన్నీ మాయం అయిపోవడం ఖాయం. పైగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు త్రివిక్రమ్. అయితే ఏపీలో దీనికి పర్మిషన్ వచ్చినా ఇంకా తెలంగాణలో మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి అయితే రాలేదు.