English   

సిక్స్ ప్యాక్ పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 

NTR-Aravinda-Sametha
2018-10-08 11:19:23

అర‌వింద స‌మేత ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన‌పుడు అంతా మాట్లాడుకున్న‌ది ఒక్క‌టే.. ఎన్టీఆర్ కూడా సిక్స్ ప్యాక్ చేసి బాడీ చూపించ‌డానికి రెడీ అయ్యాడా.. ఈయ‌న కూడా అంద‌రు హీరోల మాదిరే సిక్ప్ ప్యాక్ పిచ్చిలో ప‌డిపోయాడా..? అయినా ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా సిక్స్ ప్యాక్ ఏంటిరా నాయ‌నా అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. కానీ ఎన్ని క‌మెంట్స్ వ‌చ్చినా కూడా ఎన్టీఆర్ కానీ.. త్రివిక్ర‌మ్ కానీ దీనిపై రిప్లై చేయ‌లేదు. అయితే ఇప్పుడు ఆ టైమ్ వ‌చ్చింది. విడుద‌ల‌కు రెండు రోజుల ముందు త‌న మ‌న‌సులో మాట బ‌య‌టికి చెప్పాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో సిక్ప్ ప్యాక్ చేయాల‌నే ఆలోచ‌న అయితే త‌న‌కు లేద‌ని.. ఏదో బాడీ ఫిట్ గా ఉంచుకోడానికి మాత్ర‌మే సిక్స్ ప్యాక్ చేసాన‌ని చెప్పాడు. అంతేకానీ సినిమాలో బాడీ చూపించ‌డానికిత‌న‌కు కూడా ఇబ్బందిగా ఉంటుంద‌ని.. అయితే ఇందులో త్రివిక్ర‌మ్ మాత్రం ఆ ఫీలింగ్ రాకుండా చాలా జాగ్ర‌త్త‌గా చూపించాడ‌ని చెప్పాడు ఎన్టీఆర్. ఆ సీన్ లో ఎమోష‌న్ ఏ మాత్రం త‌గ్గ‌కుండా చూసుకున్నాడ‌ని తెలిపాడు. జ‌స్ట్ హీరోకు చొక్కా మాత్ర‌మే ఉండ‌దు.. మిగిలిన ఎమోష‌న్ అంతా క్యారీ అవుతూనే ఉంటుంది.. ఫోర్స్ గా రుద్దేసిన‌ట్లు ష‌ర్ట్ విప్పి కండ‌లు మాత్రం చూపించ‌లేద‌ని చెప్పాడు జూనియ‌ర్. అస‌లు త‌న‌కు అలా చేయ‌డం ఇష్ట‌మే ఉండ‌ద‌ని గుర్తు చేసుకున్నాడు ఎన్టీఆర్. త్రివిక్ర‌మ్ త‌న‌కు సీన్ చెప్పిన‌పుడు తాను ఇబ్బందిగా అనిపించ‌లేదు కాబ‌ట్టి సిక్స్ ప్యాక్ చూపించాను కానీ దానికోస‌మే ప్ర‌త్యేకంగా చేసి చూపించింది కాద‌ని క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. సినిమాలో ఆ సీన్ కూడా చాలా ఆస‌క్తిక‌రమైన సీన్ లో వ‌స్తుంద‌న్నాడు ఎన్టీఆర్. మ‌రి చూడాలిక‌.. రేపు విడుద‌లైన త‌ర్వాత సిక్స్ ప్యాక్ సీన్ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories