English   

సునీల్ క‌మెడియ‌నే కాదంటున్న ఎన్టీఆర్..

NTR-sunil
2018-10-08 11:35:05

అవును.. మీరు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఈ మాట‌న్న‌ది మాత్రం నూటికి నూరు శాతం ఎన్టీఆరే. అదేంటి.. 18 ఏళ్లుగా మ‌న‌ల్ని క‌డుపులు చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తున్న సునీల్ లాంటి స్టార్ క‌మెడియ‌న్ ను ప‌ట్టుకుని ఎన్టీఆర్ ఏంటి అంత మాట‌నేసాడు..? అస‌లు ఎందుకు అలా అన్నాడు అనుకుంటున్నారా..? ఉంది దానికి కూడా ఓ కార‌ణం ఉంది. సునీల్ ను మాత్ర‌మే కాదు.. బ్ర‌హ్మానందాన్ని కూడా ఆయ‌న క‌మెడియ‌న్ కాద‌న్నాడు. వాళ్లు త‌న దృష్టిలో క‌మెడియ‌న్స్ కాద‌ని.. అన‌వ‌స‌రంగా వాళ్ల‌ను మ‌నం అలా చూస్తున్నాం అని చెప్పాడు ఈ హీరో. సునీల్ లో త‌న‌కు మంచి న‌టుడు క‌నిపిస్తాడు కేవ‌లం క‌మెడియ‌న్ మాత్ర‌మే క‌నిపిస్తాడు అనుకోవ‌డం త‌ప్పే అన్నాడు ఈ హీరో. 

అర‌వింద స‌మేత‌లో చాలా ముఖ్య‌మైన పాత్ర‌లో సునీల్ న‌టించాడ‌ని.. క‌చ్చితంగా ఈ చిత్రంతో మ‌ళ్లీ అతడు బౌన్స్ బ్యాక్ అయిపోతాడ‌ని చెబుతున్నాడు యంగ్ టైగ‌ర్. త‌న‌కు సునీల్ తో చాలా త‌క్కువ సినిమాల అనుభ‌వ‌మే ఉన్నా త‌న న‌ట‌న గురించి ఐడియా ఉంద‌ని చెప్పాడు ఈ హీరో. ఆయ‌న న‌టన గురించి తెలుసు కాబ‌ట్టే సునీల్ ను ఎవ‌రైనా క‌మెడియ‌న్ అంటే ఒప్పుకోను అంటున్నాడు జూనియ‌ర్. న‌వ్వు ర‌సాన్ని మాత్ర‌మే వాడుకుని న‌వ‌ర‌సాల్ని వ‌దిలేస్తున్నామ‌ని సెటైర్ వేసాడు ఎన్టీఆర్. మ‌రి ఈయ‌న చెప్పిన‌ట్లుగా సునీల్ పాత్ర ఈ చిత్రంలో ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..?

More Related Stories