English   

సైరా కోసం చిరు క‌దిలాడు.. ర‌చ్చ షురూ.. 

Chiranjeevi
2018-10-08 11:49:42

సైరా షూటింగ్ కొన్ని రోజులుగా యూర‌ప్ లో జ‌రుగుతుంది. కానీ చిరు మాత్రం అక్క‌డ లేడు. ఇన్ని రోజులు నుంచి సిటీలో ఉన్నాడు. కొన్ని రోజులుగా ఇక్క‌డే ఉండి కొత్త సినిమాల ట్రైల‌ర్స్.. పాట‌లు విడుద‌ల చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈయ‌న కూడా జార్జియా వెళ్లాడు. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ల కోసం యూర‌ప్ దేశాల‌ను ఎంచుకున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఇప్పుడు ఈ చిత్ర టీం అక్క‌డే ఉంది. 40 రోజుల పాటు యూర‌ప్ షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీనికోసం దాదాపు 30 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేస్తున్నారు. అయితే ఈ 40 రోజుల్లో చిరు అక్క‌డ 20 రోజులు మాత్ర‌మే ఉంటే చాలు. ఆ టైమ్ ఇప్పుడు వ‌చ్చింది. ఇప్పుడు యూర‌ప్ వెళ్లాడు. అక్క‌డి టీంతో జాయిన్ అవుతున్నాడు. జార్జియాతో పాటు ర‌ష్యాలో కూడా భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ప్లాన్ చేసాడు సురేంద‌ర్ రెడ్డి. జార్జియా అంటే బాల‌య్య న‌టించిన శాత‌క‌ర్ణి గుర్తొస్తుంది. ఈ చిత్రంలోని చాలా యుద్ధ స‌న్నివేశాలు అక్క‌డే చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు క్రిష్. ఇప్పుడు చిరు కూడా బాల‌య్య వెళ్లిన చోటుకే వెళ్లాడు. యూర‌ప్ షెడ్యూల్ లో భారీగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. దీనికోసం వీళ్ల‌కు హైద‌రాబాద్ లోనే ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా ఇచ్చారు కూడా. చిరు కూడా ఈ శిక్ష‌ణ తీసుకోవ‌టం విశేషం. ఈయ‌న‌తో పాటే విజ‌య్ సేతుప‌తి కూడా ఇదే షెడ్యూల్ లో అడుగు పెడుతున్నాడు సినిమాలోకి. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రెగ్ పావెల్ నేతృత్వంలో యాక్ష‌న్ సీక్వెన్సులు తెర‌కెక్కించ‌గా.. ఇప్పుడు రాబోయే షెడ్యూల్ కోసం మ‌రో హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ లీ విట్టేకర్ ను తీసుకున్నారు. వ‌చ్చే ఏడాది సైరా విడుద‌ల కానుంది. 

More Related Stories