English   

అర‌వింద స‌మేత ఎవ‌రి ప‌క్షం..?

Aravinda-Sametha
2018-10-08 12:11:28

అర‌వింద స‌మేత నిజంగానే ఇప్పుడు ఎవ‌రి ప‌క్షం..? అదేంటి.. ఎవ‌రి ప‌క్షం ఎందుకు అనుకుంటున్నారా..? ఈయ‌న ప్ర‌జ‌ల ప‌క్ష‌మేగా.. సీమ కోసం యుద్ధం చేస్తున్నాడు క‌దా సినిమాలో క‌నిపిస్తుంది క‌దా ట్రైల‌ర్ లోనే.. ఇంకా అనుమానాలు ఎందుకు అనుకోవ‌చ్చు..? అయితే ఇక్క‌డ మ‌న‌కు వ‌చ్చిన అనుమానం సినిమాలో కాదు.. బ‌య‌ట‌.. అంటే అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ త్రివిక్ర‌మ్ స్టైల్ లో ఉంటుందా.. లేదంటే ఎన్టీఆర్ స్టైల్ లో ఉంటాడా..? ఇదే ఇప్పుడు అభిమానుల్లో కూడా వ‌స్తున్న అనుమానం. ఎందుకంటే విజువ‌ల్స్ చూస్తుంటే ఇద్దరూ స‌మానంగా ఆస్తి పంచుకున్న‌ట్లు పంచుకున్నారు. ట్రైల‌ర్ లో యాక్ష‌న్ ఫ్యాక్ష‌న్ చూస్తుంటే ఎన్టీఆర్ ప‌క్షంగా ఉన్నాడేమో అనిపించింది.. కానీ అంత‌లోనే అద్భుత‌మైన డైలాగుల‌తో త‌ను కూడా సీన్ లోనే ఉన్నాన‌ని త్రివిక్ర‌మ్ గుర్తు చేస్తున్నాడు. 

దాంతో క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌లు.. డైలాగులు చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ కంటే త్రివిక్ర‌మ్ డామినేష‌న్ ఎక్కువ‌గా ఈ చిత్రంలో క‌నిపిస్తుంది. ఇదే సంగ‌తి యంగ్ టైగ‌ర్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. త‌ను పూర్తిగా ఇందులో త్రివిక్ర‌మ్ ఎలా చెబితే అలా మారిపోయాన‌ని.. కొత్త‌గా చేసింది ఏం లేద‌ని చెప్పాడు. ఆయ‌న క‌థలో తాను కూడా ఓ భాగం అయిపోయాన‌న్నాడు జూనియ‌ర్. ఇలాంటి గొప్ప క‌థ‌లో భాగం కావ‌డం అదృష్టంగా ఫీల్ అవుతున్నాన‌ని బ‌ల‌మైన ప‌దాలు వాడాడు ఎన్టీఆర్. మ‌రి నిజంగానే రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత కూడా పూర్తిగా త్రివిక్ర‌మ్ మార్క్ క‌నిపిస్తుందా లేదంటే మ‌ళ్లీ ప‌క్షం మారుతుందా..? ఏదేమైనా మ‌రో నాలుగు రోజులు ఆగితే అస‌లు నిజాల‌న్నీ బ‌య‌టికి వ‌స్తాయి. అప్పుడు తెలుస్తుంది ఎవ‌రు ఎవ‌రి పక్షంలో ఉన్నారో..? 

More Related Stories