English   

ఆ కుర్ర హీరో దర్శకుడుగా మారుతున్నాడా..?

Vishwak-Sen
2018-10-08 12:48:30

కొందరి కల వేరే ఉంటుంది. కానీ అనుకోకుండా వేరే అవకాశాలు వస్తాయి. అప్పుడు రూట్ మారుతుంది. ఇలా మారిన రూట్ లో వెళ్లి సక్సెస్ అయి స్టార్డమ్ పొందిన వాళ్లు చాలామందే ఉన్నారు తెలుగు సినిమా పరిశ్రమలో. కాకపోతే కొందరికి మాత్రం మళ్లీ వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్య పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘ ఈ నగరానికేమైంది’ సినిమాతో హీరోగా పరిచయమైన కుర్రాడు విశ్వక్సేన్ ది ఇదే పరిస్థితి. కుర్రాడు దర్శకుడు కావాలనుకున్నాడు. కానీ సడెన్ గా ఓ సినిమాలో హీరోగా ఆఫర్ వచ్చింది. ఆ సినిమా పేరు ‘వెళ్లిపోమాకే’. కానీ ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అందులో నటించిన అతను కూడా పెద్దగా రిజిస్టర్ కాలేదు. కానీ తన కల కోసం దర్శకుడుగా మారడం కోసం షార్ట్ ఫిల్మ్స్ మొదలుపెట్టాడు. ఈ టైమ్ లో మళ్లీ లక్ తలుపు తట్టింది. అదే ఈ నగరానికేమైంది. బట్ ఈ మూవీ ఆకట్టుకోలేదు. కానీ నటుడుగా విశ్వక్సేన్ కు మంచి మార్కులు పడ్డాయి. అయినా నెక్ట్స్ ఆఫర్ రాలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని మెగాఫోన్ పట్టేందుకు రెడీ అయ్యాడు. మళయాలంలో మంచి విజయం సాధించిన ‘అంగమలై డైరీస్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు నిర్మాత కూడా దొరికాడని.. ఆల్రెడీ రీమేక్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని వినిపిస్తోంది. మరి కుర్రాడు తెర వెనకైనా సక్సెస్ అవుతాడా అనేది చూడాలి. 

More Related Stories